2.ఓ.. కొత్తోళ్ళు కంగారు పడుతున్నారట

2.ఓ.. కొత్తోళ్ళు కంగారు పడుతున్నారట

2010లో విడుద‌లైన రోబో సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టింది. ఆ సినిమా ఇచ్చిన విజయం ఇప్పుడు రాబోయే సీక్వెల్ 2.0పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఇక బాహుబ‌లిని మించేలా ఉండాల‌న్న శంక‌ర్ అత్యాశ‌తో ఆ సినిమా విడుద‌ల నెలలు నెల‌లు వాయిదా ప‌డుతూ పోతోంది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుంది?

గతేడాది దీపావ‌ళికి విడుద‌ల కావాల్సిన సినిమా... ఈ ఏడాది దీపావ‌ళికైనా విడుద‌ల అవుతుందో అవ్వ‌దో తెలియ‌ని ప‌రిస్థితి. ముందుగా చెప్పిన ప్ర‌కారం ఆ సినిమా 2017 దీపావ‌ళికి విడుద‌ల కావాలి. అప్ప‌టికి ఇంకా ప‌నులు మిగిలి ఉన్నాయ‌ని చెబుతూ... 2018 జ‌న‌వ‌రికి వాయిదా వేశారు. అప్ప‌టికీ ఇంకా వీఎఫ్ఎక్స్ ప‌నులు ఉండ‌డంతో... ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. బాహుబ‌లిని మించి చూపించాల‌న్న ఉద్దేశంతో శంక‌ర్ లాస్ ఏంజ‌ల‌స్ తిష్ట వేసి గ్రాఫిక్స్ ప‌నులు చేయిస్తున్నారు. తీరా స‌గం చేశాక‌... ఆ గ్రాఫిక్స్ సంస్థ దివాళా తీసింది. దీంతో వేరే వారికి ప‌నులు అప్ప‌జెప్పారు. ఇప్పుడు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అందులోనూ త‌మ సినిమాతో పాటూ మ‌రే సినిమా విడుద‌ల కాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర యూనిట్‌. మొద‌టి రోజే భారీ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టాల‌న్న‌ది వారి ప్లాన్‌.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. అసలు కొత్త కంపెనీ వారు కూడా శంకర్ కారణంగా కాస్త ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే శంకర్ అడిగే డిమాండ్స్ అన్నీ కాస్త గట్టిగా ఉన్నాయట. ప్రతీ చిన్న విషయంలోనూ హాలీవుడ్ రేంజులో క్వాలిటీ కావాలని శంకర్ అడగటం.. అందుకు తగిన బడ్జట్ మాత్రం ప్రొడ్యూసర్ ఇవ్వకపోవడంతో..ఈ సినిమా పనిని ఒప్పుకున్న సింగపూర్ కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ఇప్పుడు సందిగ్దతలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 2 పాయింట్ ఓ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో ఏంటో!! 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు