లెజెండరీ డైరెక్టర్.. కంప్లీట్ యాక్టర్.. మళ్లీ

లెజెండరీ డైరెక్టర్.. కంప్లీట్ యాక్టర్.. మళ్లీ

దక్షిణాది ఆల్ టైం గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఇక్కడి అత్యుత్తమ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు రెండు సినిమాలొచ్చాయి. అందులో ‘ఇద్దరు’ ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ఆ సినిమా మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు, మోహన్ లాల్ నటనా కౌశలానికి నిదర్శనంగా నిలిచింది. ఐతే ఆ సినిమా వచ్చిన తర్వాత గత రెండు దశాబ్దాల్లో మణి, లాల్ కలిసి సినిమా చేయలేదు. ఐతే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమా మొదలవుతుందట.

ప్రస్తుతం మణిరత్నం ‘చెక్క చివంత మానం’ అనే సినిమా చేస్తున్నాడు. శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ఫాహద్ ఫాజిల్, జ్యోతిక, అదితిరావు హైదరి లాంటి భారీ తారాగణం ఈ మల్టీస్టారర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. దీని తర్వాత మోహన్ లాల్‌తో సినిమా చేస్తాడట మణి. గత కొన్నేళ్లలో మోహన్ లాల్ అద్భుతమైన పాత్రలతో అలరించారు.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఒడియన్’లో మోహన్ లాల్ అవతారం చూసి అందరూ షాకైపోయారు. ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గి సరికొత్త లుక్‌లోకి మారాడు లాల్. మరోవైపు మహాభారతం నేపథ్యంలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోయే మెగా ప్రాజెక్టులోనూ లాల్ నటించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ఆలస్యమయ్యేలా ఉంది. దాని కంటే ముందే మణి దర్శకత్వంలో లాల్ నటించే వకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English