నాగ్-నాని.. ధనాధన్ ఫటాఫట్

నాగ్-నాని.. ధనాధన్ ఫటాఫట్

అక్కినేని నాగార్జున ఇప్పుడు మాంచి స్పీడు మీదున్నాడు. చకచకగా సినిమాలు లాగించేస్తున్నాడు. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ సినిమా చకచకా ముగించేస్తున్నాడు. ఈ సినిమా మే 25న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

తన తర్వాతి సినిమాను కూడా ఇదే స్పీడులో పూర్తి చేయడానికి నాగ్ చూస్తున్నాడు. నాని కాంబినేషన్లో నాగ్ చేయబోయే మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పరిమిత బడ్జెట్లో.. తక్కువ వర్కింగ్ డేస్‌ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించినట్లు సమాచారం.

పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగబోతున్న ఈ చిత్ర బృందం 50 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేయనుందట. ఈ ప్లానింగ్ నచ్చే నాగ్-నాని ఈ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇందులో నాని డాక్టర్ క్యారెక్టర్లో కనిపించనుండగా.. నాగ్ రిటైర్డ్ డాన్ పాత్రలో నటించనున్నాడట.

వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. రవితేజ సినిమా ‘నేల టికెట్’తో కథానాయికగా పరిచయం కాబోతున్న మాళవిక శర్మ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటించనుంది. ఇందులో కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఒక కీలక పాత్ర చేయనుంది. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు