సాహోలో హీరోయినా? ఐటం గాళా?

సాహోలో హీరోయినా? ఐటం గాళా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని రూమర్స్ చేస్తోన్న హడావుడి మాత్రం మాములుగా లేదు. ఆ విషయాలపై చిత్ర యూనిట్ కూడా ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక విషయం కాకపోతే మరో విషయం అభిమానులకు క్లారిటీ లేకుండా చేస్తోంది. ప్రభాస్ బాహుబలి లాంటి సినిమా తరువాత సాహో తో వస్తుండడంతో అంచనాలు మాములుగా లేవు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా సినిమాపై క్రేజ్ పెరిగింది.

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక కీలక లేడి పాత్ర కోసం బ్రిటీష్‌ బ్యూటి అమీ జాక్సన్ ని సెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు గాని దర్శకుడు మాత్రం మరో క్యారెక్టర్ కి మాత్రం పక్కా స్టార్డమ్ ఉన్న లేడి కావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ క్యారక్టర్ ను పక్కనెడితే.. ఈ ఆమీ జాక్సన్ పాత్ర కేవలం ఒక ఐటెం సాంగు కోసమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి సాహోలో ఈ ఫారిన్ పిల్ల హీరోయినా లేక ఐటం గాళా అనే విషయం తేలాలంటే మాత్రం కాస్త ఆగాల్సిందే.

యూవీ క్రియేషన్స్ వారు మొదటి నుంచి దర్శకుడు సుజిత్ చెప్పినట్టుగానే నటీనటుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి నుంచి కూడా సినిమాలో నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన ఆర్టిస్టులనే ఎంచుకుంటున్నారు. విలన్స్ గ్యాంగ్ లో మొత్తం బాలీవుడ్ తరగణమే కనిపిస్తోంది. మరి అమీ జాక్సన్ ఈ సినిమాలో ఎటువంటి రోల్ చేస్తుందో చూడాలి. అలాగే వీరందరి వలన సినిమాకు ఎలాంటి హైప్ ఉంటుందో కూడా చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English