ఇతడైనా సూపర్‌స్టార్‌కి హిట్టిస్తాడా?

ఇతడైనా సూపర్‌స్టార్‌కి హిట్టిస్తాడా?

తమిళ సూపర్‌స్టార్‌ సూర్యకి ఈమధ్య ఏదీ కలిసి రావడం లేదు. అతని సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. 24, గ్యాంగ్‌లాంటి సినిమాలకి టాక్‌ బాగానే వచ్చినా కానీ రిటర్న్స్‌ రాలేదు. ఒక టైమ్‌లో అజిత్‌, విజయ్‌లకి ధీటుగా నిలిచిన సూర్యకి తెలుగునాట వారిద్దరికీ లేనంత మార్కెట్‌ వచ్చింది. తెలుగులో ఇరవై కోట్ల బిజినెస్‌ చేసే స్థాయిని అందుకుని రజనీ తర్వాత ఇక్కడ అంతగా పాపులర్‌ అయిన తమిళ హీరో అనిపించుకున్నాడు. కానీ సూర్యకి చాలా కాలంగా ఏదీ కలిసి రావడం లేదు.

కనీసం సింగం సిరీస్‌లో చేసిన మూడవ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో సూర్య మార్కెట్‌ బాగా పడిపోయింది. శివకార్తికేయన్‌ లాంటి యువ హీరో చిత్రానికి వస్తోన్న వసూళ్లు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో విభిన్నమైన సినిమాలకి పెట్టింది పేరయిన సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య తన ముప్పయ్‌ ఆరవ చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ త్వరలో అనౌన్స్‌ కానుంది. ఈ చిత్రంతో అయినా సూర్య బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని అభిమానులు ఆశగా చూస్తున్నారు. కథల పరంగా చాలా కేర్‌ తీసుకుంటూ మంచివి ఎంపిక చేసుకుంటున్నా కానీ సూర్యకి కాలం కలిసి రావడం లేదు. ఇప్పుడు అతడికి లక్‌ కూడా చాలా అవసరం. అది సూర్య36తో అయినా దక్కుతుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు