మహేష్‌కి ఆయనంటే ఎందుకంత ఇది?

మహేష్‌కి ఆయనంటే ఎందుకంత ఇది?

మహేష్‌బాబు కుటుంబం నుంచి పలువురు సినీ రంగంలో వున్నా కానీ వారెవరికీ సూపర్‌స్టార్‌ నుంచి ప్రత్యేకమైన కేర్‌ దక్కదు. వాళ్ల సినిమాలు వచ్చినప్పుడు మాట సాయం చేయడమో లేదా ఆడియో రిలీజ్‌కి రావడమో చేస్తాడే తప్ప ప్రత్యేకించి ప్రమోషన్లకి పూనుకోడు. తమ కుటుంబ సభ్యులుగా వాళ్లకి ఇవ్వాల్సిన చిన్నపాటి చేయూతనిచ్చి వదిలేస్తాడు. సుధీర్‌బాబు కెరియర్‌ ప్లానింగ్‌ గురించి కానీ, తన కుటుంబంలో ఎవరేమి చేస్తున్నారని కానీ మహేష్‌ ప్రత్యేకించి పట్టించుకోడు.

అలాంటిది తన బావ జయదేవ్‌ గల్లా ఇద్దరు కొడుకులకీ హీరోలు కావాలానే ఆశ వుందని తెలిసి వారిని పరిచయం చేసే బాధ్యత తానే తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్లని హీరోలుగా నిలబెట్టే బాధ్యత తీసుకోవడమే కాకుండా తనకి తెలిసిన వారి ద్వారా వారికి సూటయ్యే కథల కోసం చూస్తున్నాడట. అలాగే వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి రైట్‌ వేలో గైడ్‌ చేస్తున్నాడట. తన కొడుకుల పట్ల మహేష్‌ చూపిస్తోన్న శ్రద్ధతో జయదేవ్‌ గల్లా మురిసిపోతున్నాడట.

తన సోదరి భర్త అయిన జయదేవ్‌ పట్ల మహేష్‌కి ఎంత అభిమానమంటే ట్విట్టర్‌లో మహేష్‌ ఫాలో అయ్యే ఏకైక అకౌంట్‌ ఆయన ఒక్కడిదే. ఎంపీగా పోటీ చేసినపుడు తనకి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా బావకి అండగా నిలిచాడు. ఇంతగా మహేష్‌ అభిమానించే, గౌరవించే వ్యక్తి కృష్ణ తర్వాత ఆయనేనని అంటుంటారు అతని సన్నిహితులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు