వై నాగార్జునగారూ.. వై?

వై నాగార్జునగారూ.. వై?

రాంగోపాల్‌వర్మ గతంలో చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు తీసిన దర్శకుడే కావచ్చు. గత అయిదారేళ్లలో అతను తీసిన సినిమాల జాబితా చూస్తే అతని స్థాయి ఎంతగా పడిపోయిందనేది తెలుస్తుంది. ముఖ్యంగా జిఎస్‌టి లాంటిది తీసి క్రియేటర్‌గా తన ప్రతిష్టని మరింతగా చెడగొట్టుకున్నాడు. ఇలాంటి తరుణంలో నాగార్జున అతనితో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కినేని అభిమానులు అయితే డైరెక్టుగానే నాగార్జునపై సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేసి మరీ విసుక్కున్నారు.

అయితే రాక రాక వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వర్మ సద్వినియోగం చేసుకుంటాడని, శివలా కాకపోయినా కనీసం అందులో సగమైనా వుందనిపించే సినిమా తీస్తాడనే ఆశ అయితే మిణుకు మిణుకుమంది. కానీ సదరు 'ఆఫీసర్‌' ఫస్ట్‌ లుక్‌ చూస్తే వర్మ ఈమధ్య కాలంలో అందించిన సినిమాల ఫస్ట్‌ లుక్‌కీ, దీనికీ ఏమాత్రం తేడా లేకపోగా, నాగార్జున మన్మథుడిలా కాకుండా అదోలా కనిపిస్తున్నాడు. ఈ పోలీస్‌ అందరికంటే ఎక్కువ భయపెడతాడు అనే క్యాప్షన్‌ కూడా ట్రోలింగ్‌కి అవకాశమిచ్చినట్టు అనిపిస్తోంది.

ఈ సినిమా మొదటి లుక్‌ స్టిల్స్‌ నుంచి ఇప్పుడీ పోస్టర్‌ వరకు ఎక్కడా ఆహా అనిపించేలా వర్మ చేసిందేమీ లేదు. కనీసం టీజర్‌తో అయినా అంచనాలకి భిన్నమైన అవుట్‌పుట్‌తో షాకిస్తాడని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం వాలకం చూస్తున్న వారు మాత్రం 'ఎందుకు నాగార్జునగారూ... ఇప్పుడెందుకు?' అని అడగకుండా వుండలేకపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు