ప్రేమ‌తో క‌ల్పితం: స్వ‌ర్గంలో పండ‌గ వాతావ‌ర‌ణం..!

ప్రేమ‌తో క‌ల్పితం: స్వ‌ర్గంలో పండ‌గ వాతావ‌ర‌ణం..!

శ్రీ మ‌ర‌ణం ఇచ్చిన షాక్ కు గురైన సోష‌ల్ మీడియా కోలుకోవ‌టానికి కాస్త టైం ప‌ట్టింది. ఆమె మ‌ర‌ణ‌వార్త విన్నంత‌నే అంద‌రూ త‌మ‌కున్న అభిమానాన్ని.. ఆరాధ‌న‌ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించారు. కొంటె వ్యాఖ్య‌లు.. స‌ర‌దా వ్యాఖ్య‌లు క‌ట్టిపెట్టారు. ఒకట్రెండు మిన‌హా శ్రీ మీద కామెంట్ చేసిన‌వి లేవు. అవి కూడా.. అతిలోక సుంద‌రి అంగుళీయ‌కం (ఉంగ‌రం) భూమ్మీద మిస్ కాకుండా పోతుందా?  త‌మ‌కు దొర‌క్కుండా పోతుందా? అన్న వ్యాఖ్య‌లే.
అయితే.. ఆమె మ‌ర‌ణం మీద సాగుతున్న స‌స్పెన్స్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే అనుమానాల‌తో కూడిన పోస్టులు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ శ్రీ గొప్ప‌త‌నాన్ని.. ఆమె ఎంత అంద‌గ‌త్తె అన్న విష‌యాన్ని తెలిపేలా పోస్టులే ఎక్కువ‌గా ఉన్నాయి. వీటిని చ‌దివిన వెంట‌నే. న‌వ్వు రావ‌ట‌మే కాదు.. సౌంద‌ర్య‌వతిగా అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌టం శ్రీ‌కి మాత్ర‌మే సాధ్య‌మేమోన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

తమ‌ను వ‌దిలేసి వెళ్లిపోయిన శ్రీ‌.. ప్ర‌స్తుతం స్వ‌ర్గానికి చేరుకుంద‌న్న ఊహ‌తో సోష‌ల్ మీడియాలో శ్రీ పై వ‌స్తున్న పోస్టుల్లో ముఖ్య‌మైన‌వి చూస్తే..

+ శ్రీ‌దేవి రాక‌తో స్వ‌ర్గంలో పండుగ వాతావ‌ర‌ణం

+ శ్రీ‌దేవి రాక‌తో.. ఆమెను చూసేందుకు తొక్కిస‌లాట‌

+ రంభ‌..ఊర్వ‌శి.. మేన‌క‌.. తిలోత్త‌మ‌ల మ‌ధ్య పోటీ

+ శ్రీ‌దేవిని చూసి పండ‌గ చేసుకుంటున్న ఎన్టీఆర్.. ఏఎన్నార్‌.. శోభ‌న్ బాబు

+ ఇంత‌కాలానికి ఆడ‌తోడు దొరికింద‌ని సంతోష‌ప‌డుతున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌

+ 28 ఏళ్ల త‌ర్వాత ఇంద్ర‌జ స్వ‌ర్గ‌లోకానికి తిరిగి రావ‌టంతో పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు. మ‌ళ్లీ ఎక్క‌డ ఉంగ‌రం ప‌డేసుకుంటుందోన‌ని ఆమె నుంచి ఉంగ‌రం తీసేసుకున్న ఇంద్రుడు.

+ ప్రేమాభిషేకం సినిమాను మ‌ళ్లీ రీమేక్ చేసే ప‌నిలో దాస‌రి.. ఓకే చెప్పిన అక్కినేని

+ అతిలోక సుంద‌రిని సీత‌గా చూపిస్తానంటోన్న బాపు ర‌మ‌ణ‌. వెంట‌నే షూటింగ్ స్టార్ట్ చేయాల‌న్న ఎన్టీఆర్

+ వ‌సంత‌కోకిల 2  స్క్రిప్ట్  సిద్ధం చేసుకుంటున్న ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్‌

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు