శ్రీదేవి దీన స్థితిపై వర్మ..

శ్రీదేవి దీన స్థితిపై వర్మ..

శ్రీదేవి ఏంటి.. ఆమెకు దీన స్థితి రావడమేంటి అనిపిస్తోందా..? కానీ ఆమెను దగ్గరగా చూసిన వర్మ మాత్రం శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో అన్నీ ఒడుదొడుకులే అని.. ఆమె చాలా ఒక దశలో దయనీయ స్థితికి చేరుకుందని అంటున్నాడు. శ్రీదేవి అభిమానులనుద్దేశించి వర్మ ఒక సుదీర్ఘ మైన లేఖ రాశాడు. దాన్ని ఈ రోజు ఫేస్ బుక్‌లో పెట్టాడు. ‘క్షణ క్షణం’.. ‘గోవిందా గోవిందా’ సినిమాలకు శ్రీదేవితో పని చేయడం ద్వారా ఆమెను దగ్గరగా చూసే అవకాశం దక్కిందని.. అలాగే తనకున్న సోర్స్ ద్వారా శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నానని.. బయటికి కనిపించేంత అందమైన జీవితం ఆమెది కాదని.. అందరూ అనుకునే దానికి పూర్తి భిన్నమైన జీవితాన్ని శ్రీదేవి గడిపిందని వర్మ తెలిపాడు.

ఐదేళ్లకే నటిగా మారిన శ్రీదేవి.. బయటి ప్రపంచంతో కనెక్షన్ లేకపోవడం వల్ల చాలా సున్నితంగా తయారైందని.. సినిమాల ద్వారా ఎంతో సంపాదించినప్పటికీ ఒక దశలో మొత్తం పోగొట్టుకుందని వర్మ తెలిపాడు. శ్రీదేవి తండ్రి చనిపోయాక సన్నిహితులు, బంధువులు వారిని మోసం చేశారని.. శ్రీదేవి తల్లి పెట్టిన పెట్టుబడుల్లోనూ మోసం జరిగిందని.. మరోవైపు శ్రీదేవి చెల్లెలు అనూహ్య పరిస్థితుల్లో ఆమె ఆస్తులన్నీ రాయించేసుకుందని.. అలా ఒక దశలో శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకుందని వర్మ తెలిపాడు. అలాంటి సమయంలోనే అప్పటికే నిండా అప్పుల్లో మునిగిన బోనీ కపూర్ ఆమెకు దగ్గరై తనదాన్ని చేసుకున్నాడని వర్మ తెలిపాడు. శ్రీదేవి ఎప్పుడూ తన కోసం బతకలేదని.. తన వాళ్ల కోసమే తపించిందని వర్మ తెలిపాడు.

తన అందాన్ని కాపాడుకునేందుకు శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్న మాట వాస్తవమని.. ఆ ప్రభావం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించిందని వర్మ అన్నాడు. ఇన్నేళ్లలో ఏ రోజూ శ్రీదేవి ప్రశాంతంగా లేదని.. ఇప్పుడు చనిపోయాక అయినా ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందేమో అని తాను కూడా RIP అంటున్నానని వర్మ తెలిపాడు. తాను ఇంకా రాయాలనుకుంటున్నప్పటికీ ఇంతకు మించి కన్నీళ్లను ఆపుకునే శక్తి తనకు లేదంటూ ముగించాడు వర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English