హీరోకు 1.25 కోట్ల కారిచ్చిన నిర్మాత

హీరోకు 1.25 కోట్ల కారిచ్చిన నిర్మాత

హెడ్డింగ్‌లో ప్రస్తావించిన హీరో ఎవరో కాదు.. నాగశౌర్య. అతడికి రూ.12.5 కోట్ల విలువైన పోర్షె కారును ఒక నిర్మాత బహుకరించారు. శౌర్య మీద అంత ప్రేమ చూపించిన ప్రొడ్యూసర్ ఎవరబ్బా అంటారా..? మరెవరో కాదు.. ఉష ముల్పూరి. ఆమె నాగశౌర్య తల్లే. ఇన్నేళ్లూ బయటి సంస్థల్లోనే సినిమాలు చేస్తూ వచ్చిన శౌర్య.. తొలిసారిగా సొంత బేనర్ ‘ఐరా క్రియేషన్స్‌లో ‘ఛలో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

రూ.4-5 కోట్ల మధ్య బడ్జెట్లో తెరకెక్కిన ‘ఛలో’ రూ.11.5 కోట్ల దాకా షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. శౌర్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. పెట్టుబడిపై  రెండు మూడు రెట్ల ఆదాయం రాబట్టుకుంది శౌర్య ఫ్యామిలీ. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు ఒక కారు బహుమతిగా ఇచ్చింది శౌర్య కుటుంబం. ఇప్పుడు శౌర్యకు స్వయంగా తల్లే ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు.

ఆ కారుతో ఫొటోలు దిగిన శౌర్య కుటుంబం వాటిని మీడియాకు రిలీజ్ చేసింది. త్వరలోనే ఓ కొత్త దర్శకుడితో ‘నర్తనశాల’ అనే సినిమాను తన సొంత బేనర్లోనే మొదలుపెడుతున్నాడు శౌర్య. ఇది కాక అతడికి ఇంకో రెండు కమిట్మెంట్లు ఉన్నాయి. ఇకపై తరచుగా సొంత బేనర్లో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు శౌర్య. అతను కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘అమ్మమ్మగారిల్లు’ వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు