ఆ యంగ్ హీరోకి మూడు పెళ్లిళ్లు

ఆ యంగ్ హీరోకి మూడు పెళ్లిళ్లు

గతంలో హీరోయిన్లు మాత్రమే పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. పెళ్లయితే సినిమాల్లో అవకాశాలు అంతగా రావనే ఫీలింగ్ ఇందుకు కారణం. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల తీరు కూడా ఇలాగే ఉంది. ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలినవారు బ్యాచిలర్స్ గానే కంటిన్యూ అవుతున్నారు. అయితే.. వీళ్లయినా తమ పెళ్లి గురించి అన్ని సార్లు మాట్లాడుకుంటారో.. ఆలోచించుకుంటారో లేదో తెలియదు కానీ.. మీడియా మాత్రం ఎప్పుడూ ఇదే పనిలో ఉంటోంది.

నిఖిల్ సిద్ధార్ధ పెళ్లి వార్తలు కూడా ఈ మధ్యన బాగానే వినిపించాయి. పెళ్లి కూతురు పేరు తేజస్విని అని కూడా చెప్పేశారు. ఎంగేజ్మెంట్ పూర్తయిందని.. కానీ పెళ్లి రద్దయిందంటూ కథనాలు వచ్చాయి. ఇదే విషయంపై ఇప్పుడు నిఖిల్ సిద్ధార్ధ్ రియాక్ట్ అయ్యాడు. తన పెళ్లి కబుర్లు అన్నీ రూమర్లే అన్న విషయం డైరెక్టుగా చెప్పకుండా.. మీడియాకు ఓ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 'ఏమైనా మీడియా వాళ్లకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇప్పటికే వాళ్లు నాకు మూడు సార్లు పెళ్లి చేసేశారు' అన్నాడు నిఖిల్.

తనకు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్న నిఖిల్.. మ్యారేజ్ చేసుకునేటపుడు అందరినీ పిలిచి గ్రాండ్ గా చేసుకుంటానని వెల్లడించాడు. ఇంకా ఆ సమయం రాలేదని సున్నితంగా చెప్పాడు నిఖిల్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన కిర్రాక్ పార్టీ..  షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English