పాట అదిరింది సాయి పల్లవి!!

పాట అదిరింది సాయి పల్లవి!!

తమిళ అమ్మాయి సాయి పల్లవి.. కేరళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పటివరకూ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తే.. రెండూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఫిదా.. ఎంసీఏ చిత్రాలతో అద్భుత విజయాలు అందుకున్న ఈ భామ.. ఇప్పుడు కణం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో టాలీవుడ్ హీరో నాగశౌర్య నటించినా.. అతడు ప్రచారానికి దూరంగా ఉండడంతో సాయిపల్లవి సినిమాగానే పబ్లిసిటీ దక్కుతోంది.

మార్చ్ 9న కణం చిత్రాన్ని రిలీజ్ కి షెడ్యూల్ చేయగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు 'సంజాలి' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. మెలోడియస్ గా సాగిన ఈ ట్యూన్ కానీ.. పాడిన విధానం కానీ.. విజువల్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సామ్ అందించిన మ్యూజిక్.. కృష్ణ మాదినేని రాసిన లిరిక్.. అరవింద్ శ్రీనివాస్ - అను ఆనంద్ గానం అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. ఎక్కడా ఓ డబ్బింగ్ సినిమాలో పాట వింటున్నామనే ఫీలింగ్ కొంచెం కూడా కలగలేదంటే.. పాట ఎంతగా సెట్ అయిందో అర్ధమవుతుంది.

సంజలి అనే పదాన్ని కాసింత సాగతీసి పాడినా.. సంజలి అనే కొత్త పదం ఖాయంగా క్లిక్ అవుతుంది. ఈ హిందీ వర్డ్ కి అర్ధం ఏంటంటే.. ప్రార్ధన చేసే సమయంలో రెండు చేతులను జోడించడం. అంతగా తెలియని ఓ కొత్త పదాన్ని అందిస్తూనే.. దానికి అద్భుతమైన ట్యూన్ తో ఆకట్టుకున్న తీరు మాత్రం పొగడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు