ద్రావిడ్ లా మ‌న హీరోలు ద‌ర్శ‌కులు ఉంటే

ద్రావిడ్ లా మ‌న హీరోలు ద‌ర్శ‌కులు ఉంటే

నాయ‌కుడంటే... తాను ముందుండి న‌డిపేవాడే కాదు... అంద‌రినీ స‌మన్యాయం జ‌రిగేలా చూసేవాడు కూడా. అందుకు రాహుల్ ద్రావిడ్ మంచి ఉదాహ‌ర‌ణ‌. త‌న‌కోసం, త‌న‌పేరు కోసం, త‌న డ‌బ్బుకోసం పాకులాడ‌కుండా... టీమ్ మొత్తానికి న్యాయం జ‌రిగేలా చూశాడు. అండ‌ర్ 19 టీమ్‌కు కోచ్ ఉన్న రాహుల్ ద్రావిడ్‌... త‌న టీమ్‌ను ప్ర‌పంచ‌క‌ప్‌లో విజేత‌గా నిలిపాడు. అందుకు బీసీసీఐ అందించి ప్రోత్స‌హ‌కంలో తేడాలు ఉండ‌డం అత‌నికి న‌చ్చేలేదు. అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల్సిందేన‌ని కోరాడు.

సాధార‌ణంగా అయితే కోచ్ అయిన ద్రావిడ్‌కు రూ.50లక్ష‌లు... ప్ర‌తి ఆట‌గాడికి రూ.25 ల‌క్ష‌లు... స‌హాయ‌సిబ్బందికి రూ.20 ల‌క్ష‌లు బీసీసీఐ న‌జ‌రానా అందిస్తుంది. ద్రావిడ్ టీమ్ లో అంద‌రూ క‌ష్ట‌ప‌డిన‌ప్పుడు పోత్సాహ‌క‌రాలు అంద‌రికీ స‌మానంగా ఉండాల‌ని కోరాడు. అందుకు స‌మ్మ‌తించి బీసీసీఐ ప్ర‌తి ఒక్క‌రికీ రూ.25ల‌క్ష‌లు ఇవ్వాల‌ని తీర్మానించింది. అంటే ద్రావిడ్ కూడా పాతిక ల‌క్ష‌లే అందుకుంటాడు. అంతేకాదు టీమ్‌లో స‌హాయ సిబ్బందిగా ఉండి అనుకోకుండా మ‌ర‌ణించిన వ్య‌క్తి కుటుంబానికి కూడా రూ.25ల‌క్ష‌లు అందేలా చూశాడు ద్రావిడ్‌. సొంత లాభం చూసుకోకుండా... టీమ్ కోసం తాను న‌ష్ట‌పోవ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ్డాడు. నాయ‌కుడంటే ఇలా ఉండాలి.

ద్రావిడ్‌లో మ‌న హీరోలు, ద‌ర్శ‌కులు కూడా ఉంటే...సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ఏ జూనియ‌ర్ ఆర్టిస్టు... ఇత‌ర సిబ్బంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల్సిన అవ‌స‌రం... వారి కుటుంబాలు ప‌స్తులు ప‌డుకోవాల్సిన అవ‌స‌రం రాదు. హీరోల‌కు  ఇర‌వై కోట్ల‌యినా ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డే నిర్మాత‌లు... తిండికోసం ప‌నిచేసే జూనియ‌ర్ ఆర్టిస్టులకు మాత్రం రోజుకు అయిదువంద‌లు ఇవ్వ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. పోనీ హీరోలైనా వారి కోసం పోరాడుతారా అంటే... ఇంత‌వ‌ర‌కు ఒక్కరు కూడా ప‌ట్టించుకోలేదు. ఇప్ప‌టికైనా ద్రావిడ్‌ను ఆద‌ర్శంగా తీసుకుంటే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు