మే నెల మొత్తం.. గీతా వారి కబ్జా

మే నెల మొత్తం.. గీతా వారి కబ్జా

ఎట్టకేలకు సమ్మర్ సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. మార్చ్ 30న రంగస్థలంతో స్టార్ట్ చేస్తే.. మే 4న నా పేరు సూర్య వరకు వరుసగా డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా.. ఎవరికీ నష్టం రాకుండా.. మరెవరినీ నొప్పించకుండా.. సెటిల్మెంట్ బాగానే చేసుకున్నారు. అయితే.. మిడ్ సమ్మర్ సినిమాల పరిస్థితి ఏంటనే సంగతే ఇప్పుడు తేలాల్సి ఉంది.

అంటే నట్టనడి వేసవిలో సినిమాలు రిలీజ్ చేసి.. తమతమ అదృష్టాలను పరీక్షించుకునే మహానుభావులు ఎవరు.. ఆ సినిమాలు ఏంటో లిస్ట్ తేలాల్సి ఉంది. ఇందులో కూడా గీతా ఆర్ట్స్ వారు తామే ముందుగా కర్చీఫ్ వేసేసుకున్నారు. మే 4న అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య వస్తోంది. పెద్ద సినిమాల్లో ఇదే చివరగా వస్తున్న మూవీ కావడంతో.. ఓ రెండు వారాల వరకు థియేటర్లను కదిలించే అవకాశం ఉండదు. పైగా సమ్మర్.. అందులోనూ బన్నీ మూవీ.. కచ్చితంగా రెండు వారాల పాటు థియేటర్లలో సూర్య తిష్టవేసేస్తాడు. ఆ తర్వాత కూడా థియేటర్లను వదిలే ఉద్దేశ్యం గీతావారికి లేనట్లుంది.

అందుకే మే 18న విజయ్ దేవరకొండ సినిమాను అనౌన్స్ చేసేశారు. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని మే 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ మూవీ కావడంతో.. ఇది కూడా భారీగానే విడుదల చేస్తారు. అంటే మరో రెండువారాల పాటు థియేటర్లను వదిలే ఛాన్స్ లేదన్న మాట. అలా మే నెల మొత్తం గీతా ఆర్ట్స్ కబ్జాకి గురయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు