శ్రీదేవి బయోపిక్ గురించి ఆలోచిస్తున్నారా?

శ్రీదేవి బయోపిక్ గురించి ఆలోచిస్తున్నారా?

ఓ హీరోయిన్ లేకుండా.. తమ నిర్మాణ సంస్థ లేదు అని చెప్పడం అంటే చాలా చాలా పెద్ద మాట. శ్రీదేవిని ఉద్దేశించి అదే మాట అన్నారు అశ్వినీదత్. శ్రీదేవి లేకుంటే వైజయంతీ మూవీస్ ఉండేది కాదు అనేశారాయన. అలాగని ఎన్నో సినిమాలను తీయలేదు. కేవలం మూడు చిత్రాలు మాత్రమే వీరి కాంబినేషన్ లో వచ్చాయి. అయినా సరే వాటికి వచ్చిన క్రేజ్.. ఆ విజయాల కారణంగా సంస్థ నిలబడిన తీరు అసామాన్యం.

ప్రస్తుతం సావిత్రి జీవిత గాధను సినిమాగా తీస్తున్నారు అశ్వినీదత్. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది కూడా. ఇప్పుడు శ్రీదేవి మరణం సందర్భంగా ఈ నిర్మాత స్పందించిన తీరు.. ఏకంటే కంటతడి పెట్టేయడం గమనించవచ్చు. మహానటి చిత్రాన్ని శ్రీదేవికి అంకితం ఇవ్వబోతున్నారు అశ్వినీదత్. అంతగా కదిలిపోయిన ఆయన.. 4ఏళ్ల వయసు నుంచి బాలనటిగా సినిమాలు చేసి.. ఐదు భాషల్లో టాప్ హీరోయిన్ గా వెలిగి.. బాలీవుడ్ ను సుదీర్ఘకాలం ఏలిన ఆ అద్భుత సౌందర్యంపై సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నారట. లాభాపేక్షతో కాకుండా ఆమె జీవితాన్ని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలపాలని భావిస్తున్నారట.

అయితే.. ఇంకా ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి కాని సమయంలో ఈ మాట అసందర్భంగా ఉంటుందని భావిస్తున్నారట అశ్వినీదత్. అందుకే మహానటి విడుదల తర్వాత శ్రీదేవి బయోపిక్ పనులు ప్రారంభించే అవకాశం ఉందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English