పోస్ట్ మార్ట‌మ్ త‌ర్వాత శ్రీ‌దేవిని అక్క‌డ ఉంచారు

పోస్ట్ మార్ట‌మ్ త‌ర్వాత శ్రీ‌దేవిని అక్క‌డ ఉంచారు

శ్రీ‌దేవి ఏంటి? శ్రీ‌దేవి భౌతిక‌కాయం క‌దా? అన్న డౌట్ రావొచ్చు. నిజ‌మే.. శ్రీ‌దేవి భౌతిక‌కాయం అన్న ప‌దాలు రాయ‌టానికి చేతులు ఒప్పుకోవ‌టం లేదు. శ్రీ‌దేవి.. ఎప్ప‌టికి శ్రీ‌దేవే. ఆమె మ‌ర‌ణించింద‌న్న మాట‌ను రాయాల్సి రావ‌టం క‌ష్టం. అందునా హెడ్డింగ్ భౌతిక‌కాయం లేక‌పోతే ఏమైంది?  అందుకే ఇలా.!

నిజానికి ఇలాంటి ప్రేమాభిమానాలు దేశ ప్ర‌జ‌లంద‌రివి కూడా.  త‌మ ఇంట్లో మ‌నిషిలా చూసుకోవ‌టంతోనే శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను విని దేశ‌మంతా విల‌విల‌లాడుతోంది. త‌మ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న‌ట్లు ఫీల‌వుతుంది. శ్రీ‌దేవి లాంటి సూప‌ర్ స్టార్‌.. మాట మాత్రం చెప్ప‌కుండా త‌న దారిన తాను వెళ్లిపోవ‌టం అంద‌రిని తీవ్ర వేద‌న‌కు గురి చేస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌ర‌ణానికి కాసేప‌టి ముందు దేవ‌క‌న్య‌లా త‌యారై.. బంధువుల వేడుక‌కు హాజ‌రైన ఆమె.. హోట‌ల్‌కు  తిరిగి వెళ్లిన కాసేప‌టికే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌టం తెలిసిందే. కార్డిక్ అరెస్ట్ తో హోట‌ల్ బాత్రూంలో కుప్ప‌కూలిన త‌ర్వాత ఆమెను ద‌గ్గ‌ర్లోని ర‌షీద్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌టం.. ఆ త‌ర్వాత ఆమె మ‌ర‌ణాన్ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఆ త‌ర్వాత ఆమెకు పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించారు.

ఆమె రిపోర్టులు ఆల‌స్యంగా రావ‌టంతో ఆసుప‌త్రి మార్చురీ రూంలో ఉంచి.. ఆ త‌ర్వాత ఆమెను దుబాయ్ పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంలోని మార్చురీకి త‌ర‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. వంద కోట్ల‌కు పైగా ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్న శ్రీ‌దేవి.. తాను మాత్రం దుబాయ్ పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంలోని మార్చురిలో ఒంట‌రిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా శ్రీ‌దేవిని భార‌త్‌కు తీసుకొచ్చేందుకు దుబాయ్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌య అధికారులు అక్క‌డి పోలీసుల‌తో ప‌ని చేస్తున్నట్లు చెబుతున్నా.. అక్క‌డి చ‌ట్టాల్ని క‌చ్ఛితంగా అమ‌లు చేస్తుండ‌టంతో.. ఆమె రాక అంత‌కంత‌కూ ఆల‌స్య‌మ‌వుతోంది. అతిలోక సుంద‌రి అంర్ధానంతో ఇప్ప‌టికే గుండె ప‌గిలిన శోకంతో విల‌విల‌లాడుతున్న అభిమానికి.. ఆమె రాక ఆల‌స్యం కావ‌టం మింగుడుప‌డ‌ని రీతిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు