నో బికినీ... ఎంచక్కా బట్టలేసుకుంటా!

నో బికినీ... ఎంచక్కా బట్టలేసుకుంటా!

అనుపమ పరమేశ్వరన్‌ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి చేరలేదేమో కానీ మధ్య శ్రేణి చిత్రాలకి ఆమె ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ అయింది. అందంతో పాటు టాలెంట్‌ కూడా పుష్కలంగా వున్న అనుపమకి యువతలో క్రేజ్‌ కూడా బాగుంది. అందుకే యువ హీరోలు ఆమెతో జంట కట్టడానికి ఉరకలేస్తున్నారు.

తనకి నచ్చిన కథల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ వచ్చిన ప్రతి ఆఫర్‌నీ ఓకే చేయకుండా కెరియర్‌ బిల్డ్‌ చేసుకుంటోంది. చాలా మంది హీరోయిన్ల మాదిరిగా గ్లామర్‌ షోకి అనుపమ ససేమీరా అంటోంది. వెండితెరపై ఎలా కనిపించాలనే దానిపై తనకి ఖచ్చితమైన అభిప్రాయం వుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోను మార్చుకోనని చెప్పింది. అందాల ప్రదర్శన చేయకుండా కూడా ప్రేక్షకుల్ని మెప్పించవచ్చునని, అలా స్టార్స్‌ అయిన హీరోయిన్లు వున్నారని గుర్తు చేస్తోంది.

బికినీలు వేసే ప్రసక్తే లేదని, తన కండిషన్స్‌కి ఓకే అన్న సినిమాలే చేస్తాను తప్ప ఈ పద్ధతి ఎప్పటికీ మార్చుకోనని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె చెబుతున్నట్టే స్కిన్‌ షో చేయకుండానే అనుపమ చాలా పాపులర్‌ కావడమే కాకుండా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఒకరైందంటే ఆమె చెబుతున్న దాంట్లో లాజిక్‌ వుందనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English