ఇక సినిమాలు నిజంగా తీయరట

ఇక సినిమాలు నిజంగా తీయరట

విలన్ అండ్ కమెడియన్ ఆ తరువాత హీరోగా ఎన్నో పాత్రలనుకు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మంచు మోహన్ బాబు. తన టాలెంట్ తో హీరో వరకు స్టార్ డమ్ ని తెచ్చుకున్న మోహన్ బాబు నిర్మాణ రంగంలో కూడా మంచి గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే. తన కూతురంటే మోహన్ బాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పేరు మీదే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు.

శ్రీ ల్సక్ష్మి ప్రసన్నా ప్రొడక్షన్ లో మోహన్ బాబు 40 సినిమాలను నిర్మించారు. మొదట్లో మంచి విజయాలను అందుకున్న మోహన్ బాబు ప్రస్తుత రోజుల్లో మాత్రం కొన్ని అపజయాలతో నష్టాలను చూశారు. రీసెంట్ గా నటించి నిర్మించిన గాయత్రీ సినిమా కూడా మోహన్ బాబుకి ఎక్కువగా లాభాలను ఇవ్వలేకపోయింది. అయితే ఇక నుంచి సినిమాలను నిర్మించానని మోహన్ బాబు ఇటీవల ఫైనల్ డిసిషన్ తీసుకున్నారట. రీసెంట్ గా ఆయన సన్నిహితులతో ఈ విషయాన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే యాక్టింగ్ మాత్రం కొనసాగుతుందని అది కూడా తనకు నచ్చిన పాత్రలనే చేస్తానని మోహన్ బాబు డిసైడ్ అయ్యారట. దీంతో మోహన్ బాబు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిదే అయినా మంచి కథలు వస్తే చేయమని సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఇకపోతే ఆయన కుమారుడు మంచు విష్ణు - లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం వారి సొంతంగా నిర్మాణ సంస్థలను నడుపుతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు