రంగరంగా.. ఇదేంటి తమన్!?

రంగరంగా.. ఇదేంటి తమన్!?

సంగీత దర్శకుడు తమన్ ఇచ్చే మ్యూజిక్ పై చాలానే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కాపీ ట్యూన్స్ తెస్తాడని.. నాలుగేళ్లు గుర్తుంచుకునే మ్యూజిక్ ఇవ్వడనే లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆరోపణలకు.. తొలిప్రేమకు ఇచ్చిన అద్భుతమైన ట్యూన్స్ అండ్ కంపోజిషన్ తో సమాధానం చెప్పాడు తమన్.

అందుకే ఇప్పుడు ఈ కంపోజర్ తర్వాతి సినిమాలకు ఎలాంటి సంగీతం అందిస్తాడనే ఆసక్తి నెలకొంది. నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లు నిర్మాతలు రూపొందుతున్న చిత్రం చల్ మోహన్ రంగా. ఈ సినిమాకు సంగీతాన్ని తమన్ ఇస్తున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఓ నిర్మాత కాగా.. ఇది నితిన్ కు 25 చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలోని తొలి పాట 'ఘ ఘ మేఘా' అంటూ సాగుతుందని ముందే చెప్పగా.. ఇవాళ ఉదయం పాటను రిలీజ్ చేశారు. తొలిప్రేమ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటే.. ఆ విషయంలో తమన్ డిజప్పాయింట్ చేశాడనే చెప్పాలి. పాట అండ్ ట్యూన్ వరకూ ఓకే అనిపిస్తోందంతే.

కానీ లవ్ స్టోరీస్ లో వినిపించే మ్యాజిక్ మాత్రం ఈ మ్యూజిక్ లో లేకపోవడం అందరినీ నిరుత్సాహానికి గురి చేసింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనే అంచనాలను తగ్గించేసింది. కృష్ణకాంత్ రాసిన పాట.. రాహుల్ నంబియార్ గానం బాగానే ఉన్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చల్ మోహన్ రంగ మూవీలో.. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు