నాని ధీమా చూశారా?

నాని ధీమా చూశారా?

ప్రస్తుతం టాలీవుడ్లో నానికి ఉన్న సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఇంకెవ్వరికీ లేదు. మూడేళ్ల కిందట ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు నాని. అతడి చివరి సినిమా ‘ఎంసీఏ’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. దీంతో నాని కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ మీద అంచనాలు భారీగానే నిలిచాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయాలని ఇంతకుముందే ఫిక్సయ్యారు. కాకపోతే అదే వారంలో ‘2.0’ రావచ్చన్న ప్రచారంతో సైలెంటయ్యారు.

ఈలోపు రకరకాల పరిణామాలు జరిగాయి. ఏప్రిల్ నెలాఖరుకు అనుకున్న ‘భరత్ అను నేను’ 20కి వచ్చి పడింది. ఇక మార్చి నెలాఖర్లో ‘రంగస్థలం’ విడుదలవుతోంది. ఆ తర్వాతి వారం నితిన్ సినిమా ‘ఛల్ మోహన రంగ’ కన్ఫమ్ అయింది. ఐతే ఇలా ముందు, వెనుక ఎన్ని సినిమాలున్నప్పటికీ నాని మాత్రం తగ్గట్లేదు. ముందు అనుకున్నట్లే రెండో వారంలో సినిమాను తెచ్చేస్తున్నాడు. ఏప్రిల్ 12న తమ సినిమా రిలీజవుతుందంటూ ఈ రోజు ప్రకటనలు కూడా ఇచ్చేసింది చిత్ర బృందం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అనసూయ పరమేశ్వరన్, రుక్సార్ కథానాయికలుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు