స‌ల్మాన్‌కు ఆ స‌త్తా లేద‌ట‌!

స‌ల్మాన్‌కు ఆ స‌త్తా లేద‌ట‌!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు? ఈ ప్ర‌శ్న చాలా ఏళ్ల నుంచే వినిపిస్తోంది. ఏళ్లుగా బ్యాచిలర్‌గానే నెట్టుకొచ్చేస్తున్న మ‌నోడికి గ‌ర్ల్ ఫ్రెండుల‌కు మాత్రం కొద‌వే లేద‌ని చెప్పాలి. బాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన సంగీతా బిజిలానీతో మొదలుపెట్టుకుంటే... ఐశ‌్వ‌ర్యారాయ్‌, క‌త్రినా కైఫ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగానే ఉంది. అయితే వీరంద‌రితో ఏ మేర ప్రేమాయ‌ణం న‌డిపినా... పెళ్లి దాకా ఆ సంబంధాల‌ను తీసుకురావ‌డంలో మాత్రం స‌ల్మాన్ సాహ‌సం చేయ‌లేక‌పోయాడు.

అయినా పెళ్లి చేసుకోవ‌డానికి స‌ల్మాన్‌కు ఇష్టం ఉందా?  లేదా? అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదు. ఈ దిశ‌గా ప‌లు రూమ‌ర్లు బాలీవుడ్ లో షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే వీట‌న్నింటికీ చెక్ పెట్టేస్తే... పెళ్లి చేసుకునే శ‌క్తి త‌న‌కు లేదంటూ స‌ల్మాన్ తేల్చి చెప్పేశాడు. ఈ మాట చెప్పేందుకు చాలా మంది జంకుతారు గానీ.. స‌ల్మాన్ మాత్రం ఏమాత్రం జంకూ బొంకూ లేకుండానే ఈ మాట చెప్పేశాడు. పెళ్లి చేసుకొనే శ‌క్తి లేద‌న్న స‌ల్మాన్ మాట‌ను ఇంకో కోణంలో అర్థం చేసుకోవాల్సిన ప‌ని లేదు. ఎందుంక‌టే... స‌ల్మాన్ త‌న‌కు శ‌క్తి లేద‌న్న‌ది పెళ్లికి అయ్యే ఖ‌ర్చుకు సంబంధించి.

అయినా స‌ల్మాన్ త‌న పెళ్లి, ఆ పెళ్లి చేసుకునేందుకు త‌న‌కు శ‌క్తి లేద‌ని చేసిన కామెంట్లు ఎలా సాగాయ‌న్న విష‌యానికి వ‌స్తే... *వివాహం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నా తండ్రి వివాహానికి రూ.180 ఖర్చు అయ్యింది. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లంటేనే లక్షల నుంచి కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఓ మంచి అమ్మాయిని వెతకటం దగ్గరి నుంచే ఈ ఖర్చు ప్రారంభమౌతుంది. వివాహానికి... ఆ తర్వాత భార్య కోసం కూడా అదే స్థాయిలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అదంతా భరించటం నా వల్ల కాదు. నాకా శక్తి లేదు. అందుకే నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా* అంటూ స‌ల్మాన్ త‌న‌దైన స్టైల్లో ఇంట‌రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అయితే ఫోర్బ్స్‌ లిస్ట్‌ లో అగ్రస్థానంలో ఉన్న ఓ సెలబ్రిటీ‌, పైగా  2014లో సోదరి అర్పిత వివాహాం కోసం కోట్లు కుమ్మరించి దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వేడుకలు నిర్వహించిన సల్మాన్‌ నోట ఇలాంటి మాట రావటం కాస్త కామెడీగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English