శౌర్యని టోటల్‌గా సైడ్‌ చేసారు

 శౌర్యని టోటల్‌గా సైడ్‌ చేసారు

కణం చిత్రం పట్ల హీరో నాగశౌర్య చాలా నిరుత్సాహంగా వున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లోను, ప్రతి వ్యవహారంలోను సాయి పల్లవి డామినేషన్‌ వుందని అతను పబ్లిగ్గానే తన అసహనం వ్యక్తం చేసాడు. సాయి పల్లవి మాదిరిగా యూత్‌లో పిచ్చ క్రేజ్‌ లేకపోవచ్చు కానీ నాగశౌర్యకి హీరోగా గుర్తింపు వుంది. అతని పేరిట ఛలో లాంటి విజయాలున్నాయి. కానీ కణం చిత్రబృందం అతడిని పూర్తిగా నెగ్‌లెక్ట్‌ చేస్తూ సాయి పల్లవినే హైలైట్‌ చేస్తున్నారు.

పోస్టర్లలో కూడా సాయి పల్లవిని మాత్రమే హైలైట్‌ చేస్తూ అసలు హీరో ఎవరనేది కూడా తెలీనివ్వడం లేదు. ఈ చిత్రం తమిళ, మలయాళ భాషల్లోను రూపొందుతోంది. అక్కడయితే అసలు శౌర్య నాన్‌ ఎగ్జిస్టెంట్‌ అన్నట్టు, కేవలం సాయి పల్లవి సినిమాగానే ప్రమోట్‌ చేస్తున్నారు. ఆడియో వేడుకల్లోను ఆమె మాత్రమే కనిపిస్తోంది తప్ప శౌర్య జాడ లేదు. తన పాపులారిటీని చూపిస్తూ నిర్మాతలని ఆడిస్తోందని, సెట్లో మిగతా వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని శౌర్య అన్నమాటల్లో నిజం వుందనే అనిపిస్తోంది.

అతను అంత వోకల్‌గా తన గురించి ఆరోపణలు చేసిన తర్వాత సాయి పల్లవి వాటికి స్పందించకపోగా కణం చిత్రం ప్రమోషన్లలో అతను కనిపించకుండా చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంసిఏ చిత్రానికి కూడా తన సీన్లు కొన్ని కత్తిరించారంటూ దిల్‌ రాజు, నానితో గొడవేసుకుందని అప్పట్లో గాసిప్స్‌ వచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు