అతడే న్యూ మెగాస్టార్‌!

అతడే న్యూ మెగాస్టార్‌!

ఒక హీరోకి ఆడియన్స్‌లో వున్న క్రేజ్‌ ఏమిటనేది వాళ్ల సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్‌ని బట్టి తెలుస్తుంది. ఒక హీరోకి ఇండస్ట్రీలో వున్న రేంజ్‌ ఏమిటనేది వాళ్ల పుట్టినరోజుకి వేసే బర్త్‌డే యాడ్స్‌లో తెలుస్తుంది. ఈ లాజిక్‌ ప్రకారం చూస్తే ఇప్పుడు నేచురల్‌ స్టార్‌ నానిని మించిన క్రేజీ హీరో ఇండస్ట్రీలో లేడంటే అతిశయోక్తి కాదు. పెద్ద పెద్ద హీరోల సంగతి అటుంచితే యువ హీరోల్లో నాని కోసం బారులు తీరుతున్న నిర్మాతలు ఎక్కువైపోయారు.

కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతలే కాదు భారీ నిర్మాణ సంస్థలు కూడా ఇప్పుడు నాని కోసం వేచి చూస్తున్నాయి. నాని సాధిస్తోన్న వరుస విజయాలతో ప్రతి నిర్మాతకీ ఇప్పుడతనితో సినిమా చేయాలనుంది. ఇరవై కోట్లలో నాని సినిమా పూర్తి అయిపోతే, థియేట్రికల్‌ బిజినెస్సే ముప్పయ్‌ కోట్లు జరుగుతోంది. ఇక ఇతర హక్కులన్నీ లెక్కలు చూస్తే మరో పది కోట్లొస్తాయి. అంటే నానితో సినిమా తీస్తే నిర్మాతకి రూపాయికి రూపాయి లాభం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంత రిటర్న్‌ గ్యారెంటీగా తెచ్చిపెట్టే మరో హీరో కనిపించకపోవడంతో నిర్మాతలు నాని కోసం ఎగబడుతున్నారు. ఇంకా అతని సినిమాలు ముప్పయ్‌ కోట్ల రేంజిలోనే వుండొచ్చుగాక. కాకపోతే ఈ రేంజిలో నాని మెగాస్టార్‌ స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడంటే అది ఎంత మాత్రం ఎగ్జాజిరేషన్‌ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English