అఫీషియల్.. కాలా టీజర్ ఆ రోజే

అఫీషియల్.. కాలా టీజర్ ఆ రోజే

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి తర్వాత రాబోయే సినిమా ‘కాలా’. ఈ సినిమా ఈ ఏడాది మధ్యలో రావాల్సింది కానీ.. ‘2.0’ వాయిదా పడటంతో దీన్ని ఏప్రిల్ 27న విడుదల చేయడానికి ఫిక్సయ్యాడు నిర్మాత ధనుష్. విడుదల తేదీకి ఇంకో రెండు నెలలే సమయం ఉండటంతో ఇక ప్రచార హడావుడి మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయబోతున్నారు.

‘కాలా’ టీజర్ విడుదలకు ముహూర్తం కూడా ఖరారైంది. మార్చి 1న ‘కాలా’ టీజర్ విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అతను రజినీతో ‘కబాలి’ తీశాడు. ఆ సినిమాకు విపరీతమైన హైప్ రావడానికి దాని టీజరే కారణం. అప్పట్లో అది సంచలనం రేపింది. ఇంకే రకమైన ప్రమోషన్ లేకుండానే ‘కబాలి’ జనాలకు పిచ్చెక్కించేసింది.

మరి ‘కాలా’ టీజర్ ఎలా తీర్చిదిద్దారో.. ఇది ప్రేక్షకుల్లో ఏమేరకు క్యూరియాసిటీ తీసుకొస్తుందో చూడాలి. ఐతే ‘కబాలి’ విషయంలో టీజర్ చూసి మోసపోయామన్న ఫీలింగ్ సినిమా చూసినపుడు జనాలకు కలిగింది. కాబట్టి ‘కాలా’ టీజర్ ఎలా ఉన్నప్పటికీ అప్పటి స్థాయిలో జనాలు వెర్రెత్తిపోయే పరిస్థితి లేదు. ‘కబాలి’ ఆడని నేపథ్యంలో రజినీ-రంజిత్ కాంబినేషన్ మీద ఈసారి ముందులాగా అంచనాలు కూడా లేవు. అందుకే సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ లేదు. మరి టీజర్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు