మే నెలలో సినిమాల వరదే

మే నెలలో సినిమాల వరదే

కొత్త ఏడాడిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి ఆశించిన సందడి కనిపించలేదు. రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి పరిస్థితి ఆశాజనకంగానే కనిపించింది కానీ.. భారీ సినిమాల హంగామా మాత్రం లేదు. మళ్లీ మార్చి నెలాఖరు నుంచి పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది.

ఏప్రిల్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వేడెక్కిపోవడం ఖాయం. ‘రంగస్థలం’తో పాటు ‘భరత్ అనే నేను’.. ‘కాలా’ లాంటి భారీ సినిమాలు ఆ నెలలోనే సందడి చేస్తాయి. ఇక మే నెలలో కూడా సినిమాల మోత మోగబోతోంది. ఆ నెలలో ‘నా పేరు సూర్య’ లాంటి భారీ సినిమాతో పాటు మీడియం రేంజి సినిమాలు పెద్ద ఎత్తున లైన్లో నిలవబోతున్నాయి. ఏప్రిల్లో ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘కాలా’ సినిమాలు థియేటర్లలో ఉంటాయి కాబట్టి పోటీలో వేరే సినిమాలు పెద్దగా ఉండే అవకాశం లేదు.

‘నా పేరు సూర్క్ష్’ వచ్చిన తర్వాతి వారం నుంచి సినిమాల వరద చూడబోతున్నాం. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’ విడుదలవుతుంది. అదే వీకెండ్లో నాగార్జున-రామ్ గోపాల్ వర్మల కొత్త సినిమా కూడా రావచ్చని సమాచారం. ఇక తర్వాతి వారానికి గోపీచంద్ ‘పంతం’తో పాటు విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’.. కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ కూడా షెడ్యూల్ అయిపోయాయి.

చివరి వారంలో నాగచైతన్య-చందూ మొండేటిల ‘సవ్యసాచి’ వస్తుందట. ప్రస్తుతానికి డేట్ కన్ఫమ్ చేసుకున్న సినిమాలు ఇవే. ఇంకో మూణ్నాలుగు సినిమాలైనా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. జూన్ రెండో వారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మొదలైపోతాయి కాబట్టి మే నెలలో సాధ్యమైనంత ఎక్కువగా సినిమాలు రిలీజయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు