అతడితో నాని సినిమా.. అయ్యే పనేనా

అతడితో నాని సినిమా.. అయ్యే పనేనా

తెలుగు హీరోల్లో నాని ఉన్నంత ఊపులో మరే హీరో లేడు. దాదాపు మూడేళ్లుగా అతడికి ఫెయిల్యూరే లేదు. మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు పడ్డాయి కానీ.. ఏ సినిమా కూడా పూర్తిగా నిరాశ పరచలేదు. మొన్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కూడా అది నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దీన్ని బట్టే నాని హవా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతడితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే ‘కృష్ణార్జున యుద్ధం’లో నటిస్తూ.. నాగార్జునతో మల్టీస్టారర్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్న నాని ముందు ఇంకో అరడజను దాకా ప్రపోజల్స్ ఉన్నట్లు సమాచారం.

ఐతే వీటిలో ఏది ఎంచుకోవాలో.. ఏది పక్కన పెట్టాలో తెలియని అయోమయంలో పడ్డాడట నాని. ఐతే ‘ఎంసీఏ’తో రొటీన్‌గా వెళ్లిపోతున్నాడని గట్టిగా విమర్శలెదుర్కొన్న నాని.. మొహమాటానికి పోయి ఆ తరహా సినిమాలు చేయడానికి రెడీగా లేడట. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయాల్సిన ‘చిత్రలహరి’ సినిమాకు నో చెప్పడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు. ఇలాంటి తరుణంలోనే హరీష్ శంకర్ ‘సీటీమార్’ ప్రపోజల్‌ను నాని ముందు పెట్టినట్లు సమాచారం. రెండు రోజుల కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేశాడు హరీష్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఓ హీరో ఇందులో నటిస్తాడంటూ హరీష్ అన్న మాట నాని గురించే అని సమాచారం.

దిల్ రాజుతో మాట్లాడించడం ద్వారా ఈ సినిమాకు నానిని కమిట్ చేయిద్దామని హరీష్ భావించాడట. కానీ నాని ఈ సినిమా చేయడానికి సుముఖంగా లేడని సమాచారం. ‘డీజే’తో హరీష్ ఎలాంటి విమర్శలెదుర్కొన్నాడో తెలిసిందే. ‘సీటీ మార్’ అనే పేరుకు తగ్గట్లే ఒక మాస్ సబ్జెక్టుతో నానిని సంప్రదించాడట హరీష్. ఐతే విభిన్నమైన సినిమాలు చేయడానికి సిద్ధ పడ్డ నాని.. హరీష్‌కు దాదాపుగా నో చెప్పినట్లే అని అంటున్నారు. దీని బదులు తన మిత్రుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి నాని రెడీ అయినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English