పిక్ టాక్: సమ్మోహనపరిచే అందం

పిక్ టాక్: సమ్మోహనపరిచే అందం

హైద్రాబాదీ భామ అదితి రావు హైదరి గత పదేళ్లుగా బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ భామలు అంటే పడి చచ్చే మన ఫిలిం మేకర్స్.. ఈమెను ఇంతకాలం ఎందుకు తీసుకురాలేకపోయారనే విషయం అర్ధం కానిదే. మణిరత్నం మూవీ చెలియాతో తన అందచందాలు ఏపాటివో తెలియచేసిన ఈ సుందరి.. రీసెంట్ గా దీపికా పదుకొనే ముూవీ పద్మావత్ చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించింది.

ఇప్పుడీ వయ్యారి టాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమైంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం సమ్మోహనంలో.. అదితి రావ్ హైదరి హీరోయిన్. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు మెల్లగా స్టార్ట్ చేసేశారు. ఈ చిత్రం నుంచి అదితి స్టిల్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఫ్లవర్ డిజైన్ టాప్ మాత్రమే ధరించి.. తన నవ్వుతోనే సమ్మోహన పరుస్తున్న అదితి పిక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ముడేయకుండా వదిలేసిన కురులు.. కొద్దికొద్దిగా ప్రదర్శిస్తున్న అందాలు.. ఫ్లవర్ డిజైన్ టాప్ ధరించి.. పూల మధ్యలో కూర్చుని ఇచ్చిన పోజ్ భలేగా ఉన్నాయి. అరంగేట్రంలోనే తన అందంతో టాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ సమ్మోహన పరిచేందుకు అదితి రావు ఎంతగా ప్రయత్నిస్తోందో.. ఆమె మోహంలో పడేసేందుకు దర్శకుడు అంతగానూ ప్రయత్నించేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు