సిగరెట్టు తాగుతూ ఇంటర్యూనా చౌదరి?

సిగరెట్టు తాగుతూ ఇంటర్యూనా చౌదరి?

యజ్ఞం సినిమాతో 2004లో దర్శకుడిగా మారిన ఏఎస్ రవి కుమార్ చౌదరి.. ఇప్పటివరకూ ఓ అరడజన్ సినిమాలు మాత్రమే తీశాడు. చివరగా 2015లో సౌఖ్యం వచ్చిందంతే. ఈయన ట్యాలెంట్ పై చాలామందికి నమ్మకం ఉన్నా.. కోపం బాగా ఎక్కువ అని అంటారు. అందుకే డైరెక్షన్ ఛాన్సులు అంతగా రాలేదనే టాక్ ఉంది. అలాంటి వాటిని ఈయన పెద్దగా పట్టించుకోడు. రీసెంట్ గా ఈయన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బైటపెట్టాడు.

ఒకప్పటి రాంగోపాల్ వర్మ తనకు బాగా తెలుసని.. ఇప్పుడు ఆ వర్మ లేడని చచ్చిపోయాడని అన్న ఏఎస్ రవికుమార్ చౌదరి.. చేతిలో ట్విట్టర్.. దూల ఉంటే సరిపోతుందా? అని నిలదీశాడు. నీకూ ఓ కూతురు ఉంది కదా.. ఆలోచించాలి కదా అని అభిప్రాయపడ్డాడు. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి అంతగా ఉండదని.. దర్శక నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయంటే.. మంచు లక్ష్మి - నిహారిక - మంజుల పరిస్థితి ఏంటని నిలదీశాడు ఏఎస్ రవికుమార్ చౌదరి.

ఓ ఛానల్ యాంకర్ ని ప్రేమించానని.. ఆమె వ్యభిచారని.. తనను మోసం చేసిందని.. అవసరమైతే పేరు కూడా చెబుతానని అన్న ఈ దర్శకుడు.. టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణను ఖండించాడు. ఓ వ్యక్తి మంచి చేస్తానని ముందుకొస్తే ఆరోపణలు ఎందుకు అన్న ఏఎస్ రవికుమార్ చౌదరి.. అధికారం ఇచ్చి చూసి ఆయన ఏదైనా చేస్తాడో లేదో తెలుసుకోవాలి కదా అన్నాడు. కాకపోతే ఇతడు లైవ్ లోనే సిగరెట్ వెలిగింది.. ఆన్ రికార్డ్ సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందాం నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు.

తెలుగులో రజినీకాంత్ కి సరితూగే వ్యక్తి బాలకృష్ణ మాత్రమే అని అభిప్రాయపడ్డాడు రవికుమార్ చౌదరి. కష్టపడి పైకొచ్చే వారిని ఎవరి తరం కాదంటూ.. చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ పెద్ద హీరో అయినా.. నాగార్జున మేనల్లుడు ఎందుకు కాలేకపోయాడని.. ఎఫర్ట్స్ మాత్రమే వర్కవుట్ అవుతాయని అన్నాడు. మధ్యలో అల్లు శిరీష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చి.. సంచనల విషయాలనే చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్.

కాని ఇలా సిగరెట్లు తాగుతూ ఇంటర్యూ ఇస్తే.. దానిని సంచలనం కోసం రికార్డు చేసి వేస్తే.. అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ వెళుతుందంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు