కష్టాల కళ్యాణ్‌ కు బాలయ్య అభయం

కష్టాల కళ్యాణ్‌ కు బాలయ్య అభయం

ఈ ఏడాది సంక్రాంతి రేసులో బాలకృష్ణ సినిమా జైసింహా విజేతగా నిలిచింది. నిర్మాత సి.కళ్యాణ్ కు ఈ సినిమా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ఆయనకు ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. దీని తరవాత కొద్ది రోజులకే సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేసిన ఇంటిలిజెంట్ సినిమా విడుదలైంది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది.

ఇంటిలిజెంట్ మూవీకి రూ. 15 కోట్లు ఖర్చు చేస్తే కలెక్షన్లు చేస్తే కలెక్షన్లు రూ. 5 కోట్లు కూడా రాలేదు. దీంతో నిర్మాత సి.కళ్యాణ్ నిండా మునిగిపోయిన పరిస్థితి. ఈ సినిమా పుణ్యాన ఆయన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. దీంతో ఆయనను ఆదుకునేందుకు హీరో బాలకృష్ణ ముందుకొచ్చాడట. జైసింహా సినిమా షూటింగ్ సమయంలో సి.కళ్యాణ్ తో వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది. దీంతో ఆయనకు సహాయం చేయాలని బాలయ్య అనుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నష్టాల నుంచి బయటపడేందుకోసం ఓ సినిమా చేస్తానని.. స్టోరీ సిద్ధం చేసుకోమని అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

తనకు సెంటిమెంటల్ గా కలిసివచ్చిన బాలకృష్ణతో సినిమా చేస్తే నష్టాల నుంచి బయటపడొచ్చన్న సి.కళ్యాణ్ కూడా ఫీలవుతున్నాడు. ఎక్కడపోతే అక్కడే వెతుక్కోవాలి అన్న చందాన ఇంటిలిజెంట్ తనను పీకల్లోతు నష్టాల్లో ముంచేసిన వి.వి.వినాయక్ తోనే సినిమా తీసి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడట. అయితే ఇందుకు బాలకృష్ణ ఒప్పుకోవాల్సి ఉంది. బాలకృష్ణ - వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఫ్లాప్ అయింది. అలాంటప్పుడు దీనికి బాలయ్య ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు