హరీష్ శంకర్.. పాప పరిహారం!

హరీష్ శంకర్.. పాప పరిహారం!

‘జవాన్’ సినిమా మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మళ్లీ తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని సాయిధరమ్ తేజ్ ఆశించాడు. అలాగే ‘వాంటెడ్’తో దర్శకుడిగా చేదు అనుభవం ఎదుర్కొన్న బి.వి.ఎస్.రవి కూడా ఈ సినిమాతో తనకు తొలి విజయం దక్కుతుందని ఆశించాడు. ఈ సినిమాతో నిర్మాతగా మారిన కృష్ణ కూడా ఇది మంచి బోణీ అవుతుందనుకున్నాడు. కానీ వీళ్ల ఆశలు నెరవేరలేదు. దిల్ రాజు సినిమా పూర్తయ్యాక కూడా మార్పులు చేర్పులు చేయించి.. మంచి టైమింగ్ చూసి సినిమా రిలీజ్ చేయించినా ఫలితం లేకపోయింది. ఈ చిత్రం నిర్మాతగా నష్టాలు పెద్ద స్థాయిలోనే తెచ్చి పెట్టిందట.

నిర్మాత కృష్ణ.. దర్శకుడు హరీష్ శంకర్ కు సన్నిహితుడు. నిజానికి ‘జవాన్’ సినిమాలో హరీష్ నిర్మాణ భాగస్వామి కూడా. కానీ ఏం జరిగిందో ఏమో మధ్యలో తప్పుకున్నాడు. నష్టం తప్పించుకున్నాడు. దీంతో హరీష్ సినిమా మీద నమ్మకం లేకే తప్పుకున్నాడని.. మిత్రుడికి హ్యాండ్ ఇచ్చాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అవి హరీష్ దాకా చేరాయో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు తన ఫ్రెండుకు సినిమా చేసి పెట్టి ఆదుకోవాలని హరీష్ డిసైడయ్యాడట. ఆ క్రమంలోనే ‘సీటీమార్’ సినిమా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలోనే ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్న హరీష్.. దీని తర్వాత కృష్ణతో కలిసి ‘అరుణాచల్ మూవీస్’ బేనర్లో ‘సీటీమార్’ సినిమా రూపొందిస్తాడట. వరుస విజయాలతో ఊపుమీదున్న ఒక హీరో ఈ చిత్రంలో నటిస్తాడని అంటున్నారు. నిజంగా హరీష్ ఏ ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నాడో కానీ.. దీన్ని మాత్రం బయటి జనాలు పాప పరిహారంగా చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు