నాగబాబు వరుణ్‌ను కొట్టిన వేళ..

నాగబాబు వరుణ్‌ను కొట్టిన వేళ..

తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం మామూలే. కానీ ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు పిల్లల్ని కొడితే అది వాళ్ల మనసుల్ని గాయపరచవచ్చు. తన తండ్రి నాగబాబు మామూలుగా చిన్నప్పట్నుంచి తనతో చాలా ఫ్రీగా ఉండేవారని.. కానీ ఒక సందర్భంలో మాత్రం కోపం అణుచుకోలేక తనను కొట్టేశాడని.. తనకు ఓ వయసు వచ్చాక కొట్టి తప్పు చేశాననే బాధతో ఆయన చాన్నాళ్లు బాధపడ్డారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు వరుణ్. తాను ఒక తింగరి పని చేయడంతో తన తండ్రి కొట్టారని.. తర్వాత ఎప్పుడూ తనపై చేయి చేసుకోలేదని.. కానీ ఆ ఒక్క సందర్భంలో తనను కొట్టిన విషయాన్ని కనీసం పదిసార్లు చెప్పుకుని బాధ పడి ఉంటారని.. ఇంకెప్పుడూ నిన్ను కొట్టనురా అని తనకు మాట ఇచ్చిన తన తండ్రి అది ఎప్పుడూ తప్పలేదని వరుణ్ తెలిపాడు.

ఇక తన తండ్రిపై తనకు కోపం వచ్చిన సందర్భం గురించి కూడా వరుణ్ గుర్తు చేసుకున్నాడు. ఇంటర్మీడియట్లో ఒక రోజు తాను రాత్రి చాలాసేపు కనిపించలేదని.. తన మొబైల్ కూడా పని చేయలేదని. దీంతో తనను వెతుక్కుంటూ తాను స్నేహితులతో కలిసి ఉన్న చోటికే నాగబాబు వచ్చేశాడని వరుణ్ తెలిపాడు. అప్పుడు తన స్నేహితులందరి ముందు తనను చెడామడా తిట్టేశారని.. అప్పుడు కోపంతో పాటు బాధ కూడా కలిగిందని.. ఇంటికొచ్చాక తన తల్లికి విషయం చెప్పి ఇలా చేశాడేంటి అని అరిచానని.. ఐతే తాను ఎక్కడికి వెళ్లానో తెలియక 3 గంటలుగా ఎక్కడెక్కడో తండ్రి వెదికిన విషయం తెలిసి పశ్చాత్తాప పడ్డానని వరుణ్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు