ఈ క్యాస్ట్‌ టాక్‌ ఏంటి చైతూ?

ఈ క్యాస్ట్‌ టాక్‌ ఏంటి చైతూ?

మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కొన్ని కులలా ఆధిపత్యంతో నడుస్తుందని, కొన్ని కులాల వారికి మాత్రమే ఇక్కడ పట్టంగడతారని జగమెరిగిన సత్యం. కాని వెండితెరపై మాత్రం మన హీరోలు, దర్శకులు ఈ క్యాస్ట్‌ టాక్‌తో ఒక్కోసారి మతిపోగుడుతుంటారు. సరిగ్గా యంగ్‌ రొమాంటిక్‌ హీరో నాగచైతన్య కూడా ఇలానే చేస్తున్నాడు. కాని మనోడి యంగ్‌ ఏజ్‌కు కులం అదీ అంటుంటే ఆడియన్స్‌ ఎంతవరకు కనెక్ట్‌ అవుతారో తెలియదు.

త్వరలోనే నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమా విడుదలకానుంది. ఇక ఈ సినిమా ట్రయిలర్‌లో అన్నీ సంచలనాత్మకమైన డైలాగులే. గతంలో ప్రస్థానం సినిమాతో ఎటువంటి అణుబాంబు డైలాగులు రాశాడో, ఇప్పుడు కూడా దర్శకుడు దేవ కట్టా అలాంటి మాటల తూటాలే పేల్చాడు. ఆటోనగర్‌ ట్రైలర్లో మొత్తం మనుషులు నాలుగు రకాలు అంటూ ఎవరు తమ తిండిని ఎలా సంపాదించుకుంటారనే బేసిస్‌లో ఒక అనాలిస్‌ చేసిన దేవా, లాస్టులో చైతన్యతో ఒక డైలాగ్‌ కొట్టించాడు. ‘‘ఇంకా నా క్యాస్ట్‌ ఏంటో మీకు అర్ధంకాలేదు కదూ.. నాది మోటార్‌ క్యాస్ట్‌. మనిషి బరువును, బాధను మోసుకెళ్ళే మోటర్‌ క్యాస్ట్‌’’. చైతూ చూస్తే రొమాంటిక్‌ స్వీట్‌ హార్ట్‌లా ఉంటాడు, మరి ఈ భారీ డైలాగులు వర్కవుటవుతాయా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు