సంగీతం + రాజకీయం = ఐటీ దాడులు

సంగీతం + రాజకీయం = ఐటీ దాడులు

సంగీత దర్శకుడు గిబ్రాన్ కు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. రన్ రాజా రన్.. బాబు బంగారం వంటి చిత్రాలకు మంచి సంగీతం అందించి ఆకట్టుకున్న ఈ కంపోజర్ ఇంటిపై.. ఇప్పుడు ఐటీ దాడులు జరగడం సంచలనం అవుతోంది. ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టేంతటి ఆదాయం సంపాదించేస్తున్నాడా అనే అనుమానాలు రావడం అయితే సహజమే.

చెన్నై కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించే గిబ్రాన్ కు.. తెలుగులో కంటే తమిళ్ లో డిమాండ్ బాగా ఎక్కువ. అక్కడ ఫుల్లు బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ లో.. గిబ్రాన్ పేరు ప్రముఖంగానే ఉంటుంది. అయితే.. ఈ ఐటీ రెయిడ్స్ అందుకు సంబంధించినవి కావు. ఈ కంపోజర్.. కమల్ హాసన్ కు బాగా చేరిక. ఆయనతో బోలెడంత అనుబంధం ఉందని అంటారు. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యుమ్ పార్టీలో కూడా గిబ్రాన్ కీలకమైన వ్యక్తే అనే ప్రచారం ఉంది కానీ.. తెర వెనుక కార్యకలాపాలకే పరిమితం అవుతాడట.

అయితే.. రీసెంట్ గా అనేక లావాదేవీల విషయంలో గిబ్రాన్ పై కన్నేశారు అధికారులు. టీడీఎస్ ట్రాన్సాక్షన్ అనేకం అనుమానాస్పదంగా కనిపించాయట. గతేడాదితో పోల్చితే.. ఇవి చాలా ఎక్కువగా ఉండడంతో.. గిబ్రాన్ ఇల్లు ఆఫీసులపై దాడి చేశారట ఐటీ అధికారులు. ఇక్కడ లభించిన ఆస్తులు.. నిధులకు గిబ్రాన్ కచ్చితమైన లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు