మహేష్ బ్యూటీ కూడా కష్టపడుతోంది

మహేష్ బ్యూటీ కూడా కష్టపడుతోంది

సాధారణంగా చాలా మంది అనుకునే ఒక మాట.. హీరో హీరోయిన్స్ లైఫ్ ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా సాగుతుంది. చిటికేస్తే పనులు చేసిపెట్టేవారు చాలా మంది ఉంటారు. వారికి సుఖాలు డైలీ ఫ్రెండ్ అని ఇలా చాలా అంటుంటారు. అది ఎంతవరకు నిజమో చెప్పలేము గాని ఇప్పుడు ఉన్న స్టార్స్ మాత్రం చాలా కష్టపడతారు అనే చెప్పాలి. వారు రోజు చేసే మొదటి పని వ్యాయామం.

ఫిట్ నెస్ అనుకున్నట్లుగా రావాలంటే దానికి చాలా కష్టపడాలి. సినిమా సినిమాకి డిఫెరెంట్ గా కనిపించాలి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే చాలానే చెమటోడుస్తారు. ఈ మధ్య నిధి అగర్వాల్ అలాగే  మరికొంత మంది వర్కౌట్స్  బాగానే చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు మహేష్ బ్యూటీ కైరా అద్వానీ కూడా తెగ కష్టపడుతోంది. ఈ బాలీవుడ్ హీరోయిన్ మొదటిసారి భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు సినిమాలో నటిస్తోంది. అయితే ఈ మధ్య కొంచెం గ్యాప్ రావడంతో అమ్మడి ఆకృతిపై డౌట్ వచ్చిందట. దీంతో వెంటనే తన రెగ్యులర్ ట్రైనర్ దగ్గరికి వెళ్లి జిమ్ లో తీరిక లేకుండా వ్యాయామాలు చేస్తోంది. జీరో సైజ్ లో తేడా రాకూడదు అని రోజు వర్కౌట్స్ చేస్తోందట.

ఇక భరత్ అనే నేను సినిమాలో అమ్మడికి సంబందించి సన్నివేశాలు దర్శకుడు దాదాపు పూర్తి చేశాడనికే తెలుస్తోంది. సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట. మరి ఈ బ్యూటీ అందాలు మహేష్ ఫ్యాన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English