హిట్టయితేనే చిరంజీవి సపోర్ట్‌

హిట్టయితేనే చిరంజీవి సపోర్ట్‌

ఫ్యామిలీ అంతా హీరోలే అయిపోవడంతో అందరికీ చిరంజీవి అండదండలు కావాలి. ప్రతి ఒక్కరూ తమ సినిమా ఈవెంట్లకి చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. అయితే ఒకరి సినిమా ఈవెంట్‌కి వెళ్లి మరొకరి దానికి వెళ్లకపోతే నొచ్చుకుంటారని చిరంజీవి ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి రానని చెప్పేసారట. తమ్ముడి కొడుకు, చెల్లెలి కొడుకు హీరోలే కావడం వల్ల రెండు వైపుల నుంచి చిరంజీవికి ఆబ్లిగేషన్లు వున్నాయి.

దీంతో విడుదలకి ముందు తాను ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వను కానీ విడుదలైన తర్వాత మాత్రం ఆయా సినిమాలకి మాట సాయం చేస్తానని ఇటీవలే కుటుంబం అంతా కలిసినపుడు చెప్పారట. సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే కనుక రిలీజ్‌ అయిన తర్వాత తానొక ప్రెస్‌మీట్‌ పెడతానని తొలిప్రేమ, ఇంటిలిజెంట్‌ రిలీజ్‌ ముందే చెప్పారట. రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో విడుదల కాగా, ఇంటిలిజెంట్‌ డిజాస్టర్‌ అయింది. తొలిప్రేమ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

దీంతో తొలిప్రేమ చిత్రానికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ్ముడి కొడుక్కి ఎంకరేజ్‌మెంట్‌ ఇచ్చారు. సాయి ధరమ్‌ తేజ్‌కి కూడా మేనమామ సపోర్ట్‌ కావాలంటే ఒక హిట్టు కొట్టి తీరాలన్నమాట. బాగుంది కదూ చిరంజీవి కండిషన్‌! కాకపోతే ఈ షరతులు ఆల్రెడీ స్టార్లుగా స్థిరపడ్డ చరణ్‌, బన్నీ సినిమాలకి మాత్రం వర్తించవట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు