బన్నీకి సమస్యే... కాకపోతే ఒక ప్లస్సు

బన్నీకి సమస్యే... కాకపోతే ఒక ప్లస్సు

ఏప్రిల్‌ 27 వివాదం సద్దుమణిగి మొత్తానికి నా పేరు సూర్య, భరత్‌ అనే నేను నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్‌ వుండాలనేది ఖచ్చితమైన ఒప్పందం కాగా, ముందుగా అనుకున్న డేట్‌కి రెండు సినిమాలూ రాకూడదనేది మరో కండిషన్‌. ఇలా అయితే ఎవరి ఈగోలు దెబ్బ తినవని, అభిమానులు కూడా చిన్నబుచ్చుకోరని డిసైడయ్యారు. అయితే ఏప్రిల్‌ 27 రావడం వల్ల కలిసొచ్చే మే 1 హాలిడే అడ్వాంటేజ్‌ని ఈ రెండు సినిమాలు కోల్పోయాయి. పైగా భరత్‌ అనే నేను, కాలా తర్వాత మూడో వారంలో వచ్చే నా పేరు సూర్య ఓపెనింగ్‌కి కాస్త సమస్య ఏర్పడుతుంది.

వరుసగా అన్ని సినిమాలొచ్చినపుడు కొత్త సినిమాపై ఆసక్తి పెద్ద స్థాయిలో వుండదనేది ఒప్పుకోవాలి. అయితే ముందు వచ్చే రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించని పక్షంలో చివర్న వచ్చే నా పేరు సూర్యకి అడ్వాంటేజ్‌ వుంటుంది. థియేటర్ల పరంగా సమస్య కూడా వుండదు. కానీ ఆ రెండు సినిమాలు బాగున్నాయనే టాక్‌ వస్తే మాత్రం లాస్ట్‌ వస్తోన్న నా పేరు సూర్య ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఓపెనింగ్స్‌తో పాటు థియేటర్ల పరంగా కూడా కావాల్సినన్ని దక్కకపోవచ్చు. అసలే మే రెండవ వారం నుంచి రంజాన్‌ మాసం స్టార్ట్‌ అయి నైజాం, సీడెడ్‌లో సినిమా వసూళ్లు తగ్గుముఖం పడతాయి. మొత్తం మీద ఈ ఈగో క్లాష్‌లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్‌ అనేది ఈ చిత్రాలు రిలీజ్‌ అయితే కానీ తేలదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు