తేజుని వాళ్లు ఇరికిస్తున్నారా!?

తేజుని వాళ్లు ఇరికిస్తున్నారా!?

ఓ సినిమా మేకింగ్ సమయంలోనో.. లేకపోతే రిలీజ్ టైంలోనో అదే కాంబోలో మరో మూవీ వస్తోందని చెప్పడం కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో సాకారం అయ్యేవి అతి కొద్దిగానే ఉంటాయి. ఇలాంటిదో మరేదో చెప్పలేం కానీ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ మూవీ చేశాడు సాయిధరం తేజ్.

అంతకు ముందు తిక్క ఫ్లాపుతో ఇబ్బంది పడ్డ తేజుకు విన్నర్ పెద్ద షాక్ నే ఇవ్వగా ఇంకా కోలుకోలేదు. వరుసగా ఐదు భారీ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇతగాడి సినిమాల లైనప్ మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం కరుణాకరన్ మూవీలో నటిస్తున్న ఈ మెగాహీరో.. మారుతి.. కిషోర్ తిరుమల.. చంద్రశేఖర్ యేలేటి వంటి దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. వీటిని గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్.. మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలు నిర్మించనుండడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా భగవాన్- పుల్లారావులు నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ.. మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతూ ప్రెస్ రిలీజ్ వచ్చేసింది.

వీరితో సినిమా అనుకున్న మాట వాస్తవమే అయినా.. కొంతకాలం తర్వాత ఈ ప్రాజెక్టు చేయాలని అనుకుటుంన్నాడట తేజు. కానీ ఇతనికి తెలియకుండానే సడెన్ గా ఇలా ప్రెస్ రిలీజ్ ఇచ్చేయడం ఆశ్చర్యం కలిగించిందట. మీడియాకు లీకులు ఇచ్చేసి.. మెగా హీరోను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు