బాఘీ2.. బాలీవుడ్ లో బన్నీకి పోటీ

బాఘీ2.. బాలీవుడ్ లో బన్నీకి పోటీ

అల్లు అర్జున్ సినిమాలకు నార్త్ లో కూడా ఫుల్లు గిరాకీ ఉంటుంది. అక్కడి టీవీల్లోనూ.. యూట్యూబ్ లోనూ సరైనోడు సాధించిన సక్సెస్ ను ఇందుకు కొలమానంగా చెప్పవచ్చు. అయితే.. నాపేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి.. దేశంలో ఈ స్థాయి యాక్షన్ బేస్డ్ ఇంటెన్స్ మూవీ రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ2 ట్రైలర్ వచ్చింది. నిజానికి ఇది తెలుగు మూవీ క్షణం కు హిందీ రీమేక్. కానీ సినిమా ట్రైలర్ చూస్తే.. క్షణం ఒరిజినల్ ఎసెన్స్ ఏమాత్రం క్యారీ చేయలేదనే సంగతి అర్ధమవుతుంది. పైగా బాఘీ2లో చొప్పించిన యాక్షన్ కంటెంట్ చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఇండియాలో రాంబో మూవీ తీశారా ఏంటి అనే డౌట్ అయితే రాక మానదు. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం.. రాంబోతో కాకుండా మన టాలీవుడ్ మూవీ.. అందులోనూ అల్లు అర్జున్ మూవీ నాపేరు సూర్యతో కంపేర్ చేస్తున్నారు. నా పేరు సూర్య చిత్రానికి.. అందులో ఉన్న యాక్షన్ కంటెంట్ కు.. బాఘీ2 సమాధానం ఇస్తోందని అంటున్నారు.

కాన్సెప్ట్ పరంగా కానీ.. స్టోరీ పరంగా కానీ  చూస్తే.. ఇవి రెండు అసలు సంబంధం లేని చిత్రాలు కావచ్చు కానీ.. యాక్షన్ కంటెంట్ పరంగా మ్యాచ్ అవుతున్నాయి. పైగా యాక్షన్ లో చూపించిన ఇంటెన్సిటీ అయితే ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారనే సంగతి అర్ధమవుతుంది. మరి ఎవరికి ఎవరు సమాధానమో తెలియాలంటే.. రెండు సినిమాల రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు