విక్రమ్‌కు భలే ఛాన్సులే..

విక్రమ్‌కు భలే ఛాన్సులే..

ఒకప్పుడు ‘శివపుత్రుడు’.. ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో తెలుగులో మాంచి మార్కెట్, ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విక్రమ్. ఇప్పుడు తెలుగులో సూర్యకున్న ఫాలోయింగ్ కంటే విక్రమ్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. కానీ ఆ తర్వాత చెత్త చెత్త సినిమాలు చేసి ఆ మార్కెట్ మొత్తం పోగొట్టుకున్నాడు విక్రమ్. మధ్యలో ఒక్క ‘ఐ’ మాత్రమే ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. దానికి ముందు, తర్వాత చాలా సినిమాలు తుస్సుమనిపించాయి. ఈ మధ్య అతడి సినిమాలు నేరుగా తమిళంతో పాటు తెలుగులో విడుదలయ్యే పరిస్థితి కూడా లేదు. చివరగా ‘10’ అనే సినిమాను రిలీజ్ చేశారు. అది వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు.

తాజాగా తమిళంలో సంక్రాంతికి విడుదలై ఓ మోస్తరుగా ఆడిన ‘స్కెచ్’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన తమన్నా నటించింది. విజయ్ చందర్ దర్శకుడు. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేని సమయంలో దీన్ని రిలీజ్ చేస్తుండటం కలిసొచ్చే విషయమే. తమన్నా కూడా సినిమాకు ఆకర్షణే. ఈ వారం మిగతా సినిమాలన్నీ కలిపితే ఎన్ని థియేటర్లలో రిలీజవుతున్నాయో.. అంతకంటే ఎక్కువ థియేటర్లలో ‘స్కెచ్’ను రిలీజ్ చేస్తుండటం విశేషం. ‘రా..రా’.. ‘జువ్వ’.. ‘చల్తే చల్తే’ లాంటి సినిమాల మధ్య ఈ వారం బాక్సాఫీస్ లీడర్ ఇదే అయ్యేలా ఉంది. మరి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో విక్రమ్ ఓ మోస్తరు సక్సెస్ అందుకుంటాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు