హీరోయిన్ కు గౌను వేస్తారా? పరువు పోయింది

హీరోయిన్ కు గౌను వేస్తారా? పరువు పోయింది

ప్రియాంక చోప్రా... ఇప్పుడు గ్లోబ‌ల్ న‌టి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చేరి... అక్క‌డే దాదాపు సెటిలైపోతోంది. ఆమె అక్క‌డ ఎంత బిజీ అయిపోయిందంటే... క‌నీసం బాలీవుడ్ సినిమాలు ఒప్పుకునే తీరిక కూడా లేదు. హాలీవుడ్ మూవీలనే వ‌రుస‌గా చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఆ ప్రియాంక చోప్రా అస్సాంలోని కాంగ్రెస్ నేత‌ల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.

అస్సాం ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంది ప్రియాంక చోప్రా. కొత్త ఏడాది సంద‌ర్భంగా... జ‌న‌వ‌రి 1న క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది అస్సాం ప‌ర్యాట‌క శాఖ‌. అందులో పీసీ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలో చిన్న గౌను వేసుకుని ఉందామె. ఆమె లుక్కు క్యాలెండ‌ర్ ఏం బాగోలేదంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గొడవ చేస్తున్నారు. ఆమెను బ్రాండ్ అంబాసిడ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కోరుతున్నారు. అస్సాం రాష్ట్ర ప‌ద్ద‌తులు, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా పీసీ ఫోటోల్లో లేద‌ని, ఆమె చిన్న గౌనుకు బ‌దులు త‌మ సంప్ర‌దాయ దుస్తుల‌ను వేసుకుంటే బాగుండేద‌ని కామెంట్లు చేస్తున్నారు. పీసీ డ్రెస్సింగ్ రాష్ట్ర ప‌రువును త‌గ్గించేలా ఉందంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ వారే ఇలా ప‌ద్ద‌తులు, సంప్ర‌దాయాలు అంటూ గొడ‌వ‌లు చేసేవార‌నుకుంటే... ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరిపోయింది.

ఈ విష‌యంపై అస్సాం ప‌ర్యాట‌క శాఖ అధికారికి మాట్లాడుతూ... ప్రియాంక చోప్రా ప్రపంచ‌వ్యాప్తంగా పేరు సంపాదించింద‌ని... ఆమె గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగింద‌ని... అందుకే ఆమెను త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకున్న‌ట్టు చెప్పారు. ఆమె డ్రెస్సింగ్ వ‌ల్ల అస్సాంకు వ‌చ్చే చెడ్డ‌పేరు ఏమీ ఉండ‌ద‌ని తెలిపారు.

ప‌దిహేడేళ్ల‌కే మిస్ వ‌రల్డ్ కిరీటాన్నిభార‌త్‌కు తీసుకొచ్చింది పీసీ. ఆ త‌రువాత బాలీవుడ్ సినిమాల‌లో టాప్ హీరోయిన్ రేంజికి చేరుకుంది. హాలీవుడ్ లో కూడా క్వాంటికో సిరీస్‌తో అక్క‌డి వారి మ‌న‌సులు దోచింది. ఇప్పుడు రెండు హాలీవుడ్ సినిమాల‌లో చేస్తూ బిజీగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు