రిషితోనూ రెడీ అంటున్న ప్రియా!!

రిషితోనూ రెడీ అంటున్న ప్రియా!!

ఒక్కసారి కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన మాయలో పడేసిన 18 ఏళ్ల వయ్యారి ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. జస్ట్ టీజర్ తోనే ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ ఫస్టియర్ బీకాం స్టూడెంట్ తనకు వచ్చిన క్రేజ్ పై ఎలా ఫీలవుతోందో.. ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానాలతో అర్ధం చేసుకుందాం.

ఇంత తక్కువ సమయంలో ఇంత క్రేజ్ వస్తుందని ఊహించారా?
ఇలాంటి క్రేజ్ అసలు ఊహించలేదు. నన్ను సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం ఎంపిక చేశారంతే. నా ట్యాలెంట్ చూసి దర్శకుడు ఒమర్ పాత్ర పరిధి పెంచాడు. కన్నుగీటడం, గన్ షూట్ ఐడియాలు అతనివే. తనకే క్రెడిట్ దక్కాలి.

సన్నీలియోన్ ని మించి మీకోసం సెర్చింగ్ జరుగుతోంది. దీనిపై ఎలా ఫీలవుతున్నారు?
ఈవార్త చదివిన తర్వాత ఆశ్చర్యం వేసింది. నాకోసం జనాలు వెతుక్కుంటుంటే.. చాలా బాగుంది.

మీ గురించి చెప్పండి. యాక్టింగ్ లోకి రావాలని గతంలోనే అనుకున్నారా?
నా కుటుంబంలో గ్రాండ్ పేరెంట్స్.. పేరెంట్స్.. ఓ తమ్ముడు ఉన్నారు. నేను సినిమాల్లోకి రావాలని ముందు నుంచి కోరుకున్నా. ఒరు అడార్ లవ్ పూర్తయ్యాక మిగిలిన సినిమాల గురించి ఆలోచిస్తా.

బాలీవుడ్ ఛాన్సులు వస్తే?
బాలీవుడ్ లో నటించడం ఎవరికైనా డ్రీమ్. నేను కూడా అంతే. అక్కడి నుంచి ఆఫర్స్ కోసం చూస్తున్నా.

రిషి కపూర్ మీతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉందని ట్వీట్ చేశారు. ఎలా అనిపించింది?
నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది. ఆయన అలా చెప్పడం నచ్చింది. అవకాశం వస్తే తప్పక చేస్తాను.

బాలీవుడ్ లో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు?
షారూక్ ఖాన్.. రణవీర్ సింగ్.. సిద్ధార్ధ మల్హోత్రా. అలాగే దీపికా పదుకొనే అంటే చచ్చేంత ఇష్టం.

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతం అయితే స్టడీస్ పూర్తి చేయాలి. చాలా సినిమాలు చేయాలి. అనేక ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మంచివి ఎంచుకుని సినిమాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు