ఈ అవకాశం అదృష్టమే!!

ఈ అవకాశం అదృష్టమే!!

ఒక ఏడాదిలో ప్రతి సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత మంది పరిచయం అవుతారో గాని హీరోయిన్స్ మాత్రం అంతకంటే ఎక్కువ రేంజ్ లో పరిచయం అవుతారనేది వాస్తవం. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్ అందంగానే ఉంటుంది. కానీ వారిలో క్లిక్ అయ్యేది చాలా తక్కువమంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. మొదటి అవకాశం పెద్ద సినిమాల్లో దొరకడం అదృష్టమే. సీనియర్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం ఇంకా పెద్ద లక్.

ఇప్పుడు ఆ రెండు అదృష్టలను పొందిన ఒక ఫ్యాషన్ గర్ల్ చాలా హ్యాపీగా ఉంది. మణిరత్నం నెక్స్ట్ ఒక మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతోన్న సంగతి అందరికీ తెలిసిందే. నవాబ్ అని టైటిల్ ని కూడా సెట్ చేశారు. ఇకపోతే సినిమాలో కొత్త బ్యూటీ డయానా ఎరప్ప అవకాశం అందుకుంది. సినిమాలో ఒక కీలకమైన రోల్ లో ఈ బ్యూటీ కనిపించనుంది. రీసెంట్ గా అమ్మడు తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. డయానా మాట్లాడుతూ.. మొదటి నాకు మణి సర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఏదో ఫెక్ కాల్ అనుకున్నా.

కానీ ఆ తరువాత నిజమని తెలిసి ఆశ్చర్యపోయా. వెంటనే ఫొటోస్ పంపించాను. రెండు సార్లు ఆడిషన్ లో పాల్గొన్నా. కొన్ని రోజుల తరువాత నాకు ఫోన్ చేసి మిరే సినిమాలో నటిస్తున్నారు అని చెప్పారు. ఆ టైమ్ లో నేను అమెరికాలో ఉన్నా. మణిరత్నం గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనను మొదటి సారి కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా కూల్ గా మాట్లాడారు. ప్రస్తుతం థియేటర్ ఆర్టిస్టులతో కొన్ని వర్క్ షాప్స్ చేస్తున్నా. నటనపై ఇంకా అవగాహన పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్లు డయానా వివరించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు