సీటీమార్ అంటున్న హరీశ్‌ శంకర్

సీటీమార్ అంటున్న హరీశ్‌ శంకర్

టాలీవుడ్ లో మన సినీ దర్శకుల టేస్ట్ ఏంటో ఒక్కోసారి స్పెషల్ సాంగ్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంటుంది. లవ్ సాంగ్స్ అయినా ఎమోషనల్ లేదా ఐటెమ్ సాంగ్స్ అయినా దర్శకుల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. దానికి తోడు సంగీత దర్శకుల మేధస్సు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అయితే మాస్ దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాల్లో సాంగ్స్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. చివరగా అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాలో దాదాపు అన్ని సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.

ముఖ్యంగా సీటీమార్ అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీట్ చాలా వర్కౌట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ తో ఓ సరికొత్త సినిమా రాబోతోంది. అది కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలోనే. ఎంటర్టైన్మెంట్ మాస్ అంశాలతో కూడుకున్న కథలను రాయడంలో హరీష్ శంకర్ బెస్ట్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఒక సక్సెల్ ఫుల్ యువ కథానాయకుడితో సీటీమార్ అనే టైటిల్ తో అదే తరహాలో ఒక సినిమా చేయనున్నాడట ఈ దర్శకుడు.

కాన్సెప్ట్ సెట్ చేసుకున్న హరీష్ త్వరలోనే స్క్రిప్ట్ పనులను మొత్తం పూర్తి చేస్తాడట. సక్సెస్ ట్రాక్ లో ఉన్న యువ కథనాయకుడితో సీటీమార్ టైటిల్ తో సినిమాను చేయనున్నడాని తెలుస్తోంది. ఇక జవాన్ సినిమాను నిర్మించిన కొమ్మలపాటి కృష్ణ ఆ సినిమాని నిర్మించనున్నాడు. ప్రస్తుతం హరీష్ దిల్ రాజు ప్రొడక్షన్ లో దాగుడుమూతలు అనే సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్ల్ స్టార్ట్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు