అహం బ్రహ్మాస్మి.. టైటిల్ ట్విస్ట్

అహం బ్రహ్మాస్మి.. టైటిల్ ట్విస్ట్

అహం బ్రహ్మాస్మి.. కొన్ని రోజులుగా టాలీవుడ్లో హల్ చల్ చేస్తోందీ టైటిల్. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించబోయే స్పేస్ ఫిలింకి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఐతే స్పేస్ ఫిలింకి ఈ టైటిల్ ఏంటా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మరి ఈ టైటిల్లో ఏం మతలబు ఉందో అనుకున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. వరుణ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టట్లేదు. ఈ టైటిల్ మరో సినిమాకు ఖరారైంది. అది స్టార్ డైరెక్టర్ క్రిష్ తెలుగులో రూపొందించబోయే తర్వాతి సినిమాకు కావడం విశేషం.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ తీస్తున్న క్రిష్.. ఏడాదిన్నర విరామం తర్వాత ఇక్కడికి రానున్నాడు. ఆగస్టులో అతను ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో సినిమా తీయనున్నాడట. ఒక స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తాడంటూ ఈ రోజు ప్రకటన వచ్చింది. క్రిష్ ఫ్యామిలీ బేనర్లో రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు నిర్మించింది వీళ్లే. వరుణ్ సినిమాను ప్రొడ్యూస్ చేయబోయేది కూడా వీళ్లే. దీంతో ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌ను ఈ బేనర్ మీద రిజిస్టర్ చేసేసరికి ఆ సినిమాకే ఈ టైటిల్ అన్న ప్రచారం జరిగింది. ఐతే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో స్పష్టత వచ్చింది. క్రిష్.. విక్టరీ వెంకటేష్‌తో ‘అహం బ్రహ్మాస్మి’ చేయొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు