రకుల్ అందాలను పట్టించుకోలేదే?

రకుల్ అందాలను పట్టించుకోలేదే?

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. అందుకే స్టార్ హీరోయిన్స్ అవకాశాలు ఎక్కువగా వచ్చినపుడే రెమ్యునరేషన్ ని గట్టిగా డిమాండ్ చేస్తుంటారు. అదే తరహాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా గత ఏడాది వరకు బాగానే అందుకుంది. ఆమె క్రేజ్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే భారీ అంచనాల మధ్య స్పైడర్ విడుదలైందో ఆ సినిమా రిజల్ట్ అమ్మడికి దెబ్బ బాగానే కొట్టింది.

అయితే తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ వైపు అమ్మడు ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే మొన్న రకుల్ కొన్ని బికినీ ఫొటోలతో రచ్చ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ బికినీ ఫొటో షూట్ కి సంబందించిన వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. రకుల్ ఫొటోలు మొదట బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియో మాత్రం డిజాస్టర్ అయ్యింది. విడుదలై రెండు రోజులైనా కనీసం 1.3 లక్షల వ్యూస్ కూడా రాలేదు.

దీంతో అమ్మడి బికినీ ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు అనే అనుమానాలు కలుగుతున్నాయి. బికినీ లుక్ లో ఎప్పుడు కనిపించని హీరోయిన్స్ సడన్ గా కనిపిస్తే జనాలు ఎగబడి చూడటం చాలా కామన్. కానీ స్టార్ హీరోయిన్ రకుల్ అందాలను ఎంత ఘాటుగా ప్రజెంట్ చేసినా కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఆమెకు ప్రశంసలు అన్ని అందుతున్నాయో గాని విమర్శలు మాత్రం గట్టిగానే వచ్చాయి. అయితే రకుల్ మాత్రం నా అందాలు నా ఇష్టం అనే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు