మహేష్ మాట వినడంటున్న మంజుల

 మహేష్ మాట వినడంటున్న మంజుల

మహేష్ బాబు లాంటి పెద్ద హీరో మంజులకు స్వయంగా తమ్ముడు. ఆమె దర్శకురాలిగా మారాలని అనుకున్నపుడు ముందు మహేష్‌నే అడిగి ఉండొచ్చు. కానీ ఆమె సందీప్ కిషన్‌ను కథానాయకుడిగా ఎంచుకుంది. తన దగ్గర పవన్ కళ్యాణ్‌కు తగ్గ కథ ఉందని.. ఆయన ఓకే అంటే సినిమా చేస్తానని కూడా ప్రకటించింది మంజుల.

ఐతే మహేష్‌తో సినిమా చేసే అవకాశాల గురించి మాత్రం ఆమె మాట్లాడలేదు. మరి మహేష్ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు అని అడిగితే.. అతను తన మాట వినే ప్రసక్తే లేదని అంది మంజుల.

‘‘నేను డైరెక్టర్ అవుతున్నానంటేనే మహేష్ షాకయ్యాడు. ఇక నా సినిమాలో నటించు అని అడిగితే అంతే సంగతులు. అతను చేయనంటాడు. అసలు అతను నా మాట వినడు. నేనొకటి చేయమంటే తనొకటి చేస్తానంటాడు. అసలు మహేష్ నాకు దొరకడు. అందుకే సందీప్ దొరికాడని అతడితో సినిమా చేశా. మహేషే పిలిచి తనతో సినిమా చేయమంటే అప్పుడు ఆలోచిస్తా. ఇక పవన్‌తో సినిమా చేస్తానని ఎందుకన్నానంటే.. అతను మా నాన్న తరహాలో కనిపిస్తాడు. నాన్న లాగే చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ డమ్ వస్తే గర్వం వస్తుంది. కానీ పవన్‌లో అది రవ్వంతైనా కనిపించదు. తన మనసుకు నచ్చిందే చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు స్ఫూర్తినిచ్చి ఆయన కోసం కథ రాశాను. చూద్దాం ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తుందేమో’’ అని మంజుల చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు