సుప్రీం మాట‌.. ప్రియ‌కు తీపి క‌బురు

సుప్రీం మాట‌.. ప్రియ‌కు తీపి క‌బురు

రాత్రికి రాత్రి స‌న్సేష‌న్ స్టార్ గా మార‌ట‌మే కాదు.. త‌న క‌నుసైగ‌ల‌తో యావ‌త్ దేశాన్ని ప్లాట్ చేసిన ఘ‌న‌త కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కు ద‌క్కింది. ఆమె న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ఒరు ఆధార్ ల‌వ్ పాట‌లో ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ సంచ‌ల‌నంగా మారితే.. త‌ర్వాత ఆ పాట‌లో ప‌దాలు ముస్లింల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఉన్నాయంటూ తెలంగాణ‌.. మ‌హారాష్ట్రలో కేసులు న‌మోద‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ‌పై న‌మోద‌వుతున్న‌కేసుల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ సినీ ద‌ర్శ‌కుడు.. నిర్మాత‌.. న‌టి ప్రియలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన అత్యుత్త‌మ న్యాయ‌స్థానం సానుకూలంగా స్పందించింది. ఈ పాట విష‌యంలో దేశంలో మ‌రెక్క‌డా న‌టి ప్రియ‌తో స‌హా.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వారికి తీపి క‌బురుగా మార‌తాయ‌న‌టంలో సందేహం లేదు.

ఒరు ఆధార్ ల‌వ్ మూవీలో మానిక్య మ‌ల‌రాయ పూవి పాట‌లో ప్రియా క‌నుగీటే స‌న్నివేశాలు.. ఆ పాట‌లో వాడిన ప‌దాల‌తో పాటు.. ముస్లింల మ‌నోభావాలు దెబ్బ తీసేలా పాట చిత్రీక‌ర‌ణ సాగింద‌న్న ఆరోప‌ణలున్నాయి. ఈ నేప‌థ్యంలో వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రు యువ‌కుల‌తో పాటు.. మ‌హారాష్ట్రలోనూ ఫిర్యాదు చేశారు. త‌మ‌కొచ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో పోలీసులు చిత్రబృందానికి నోటీసులు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌పై కేసులు న‌మోదు కాకుండా స్టే విధించాలంటూ సుప్రీంను ఆశ్ర‌యించిన ప్రియా.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఊర‌ట‌నిస్తూ సుప్రీం తాజా ఆదేశాల్ని జారీ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English