చరణ్ సినిమాకు అంత రేటా?

చరణ్ సినిమాకు అంత రేటా?

రంగస్థలంకు సినిమా అయిపోగానే రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి  సిద్దపడుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ తరహాలో తెరకెక్కినున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. దీంతో ముందే సినిమా బిజినెస్ కూడా మొదలు పెట్టింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే తెలుగు బిజినెస్ పూర్తవ్వకముందే హిందీ రైట్స్ విషయంలో సినిమా ఆశ్చర్యపరుస్తోంది.

మొదటి సారి ఏ తెలుగు హీరో అందుకొని రికార్డ్ ను రామ్ చరణ్ అందుకుంటున్నాడు. ఏకంగా రూ 22కోట్ల వరకు హిందీ హక్కుల ధర పలుకుతోందట. ఆల్ రెడీ అడ్వాన్స్ కూడా అందిందని తెలుస్తోంది. ఈ స్థాయిలో అందడానికి కారణం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డైరెక్టర్ సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. బోయపాటికి గత సినిమాలు నార్త్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సరైనోడు అయితే యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.

టీవీల్లో కూడా ఆ సినిమాకు ఇప్పటికి కూడా మంచి ఆదరణ అందుతోంది. అందువల్ల బోయపాటి నెక్స్ట్ సినిమాకు కూడా భారీ డిమాండ్ పెరుగుతోంది. అంతే కాకుండా వివేక్ ఒబెరాయ్ అందులో విలన్ గా చేయడం మరొక ప్లస్ పాయింట్. అయితే రామ్ చరణ్ గత సినిమాలకు మాత్రం నార్త్ లో పెద్దగా ఆదరణ దక్కలేదు. డైరెక్ట్ గా బాలీవుడ్ లో చేసిన జంజీర్ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ కి బోయపాటి డైరెక్షన్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు