డోంట్ కేర్ నుండి 'క్యార్ క్యార్' అంటున్నాడే

డోంట్ కేర్ నుండి 'క్యార్ క్యార్' అంటున్నాడే

రాంగోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్స్ కి మారుపేరు. కాంట్రవర్సీలతో కాపురం చేయడం ఈయనకు తెలిసినంతగా మరెవరికీ రాదేమో. వీటిని తన ప్రాజెక్టులకు ఉపయోగంచుకోవడంలో మహా ఆరితేరిపోయిన మేథావి వర్మ.

ఇప్పటివరకూ ఇలాగే నడిచింది కానీ.. ఇప్పుడెందుకో రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. సహజంగా పలు వివాదాలను తనే స్టార్ట్ చేసే ఈయన.. ఆ తర్వాత వచ్చే విమర్శలను ఏ మాత్రం ఖాతరు చేయడు. కానీ జీఎస్టీ విషయంలో జరిగిన రగడ.. ఓ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనాలు.. ఓ మహిళా రాజకీయ నాయకురాలు చేసిన విమర్శల విషయంలో మాత్రం.. విభిన్నంగా రియాక్ట్ అవుతున్నాడు. తను వాళ్లపై కేసులు పెట్టబోతున్నట్లు.. వీటిలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు.. లాయర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు.. కంటిన్యూగా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

ఎప్పుడూ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ఉండే రాంగోపాల్ వర్మ.. సడెన్ గా ఇలా విమర్శలకు ప్రతిస్పందించడం.. కేసులు పెట్టనునట్లు చెప్పడం ఏంటో జనాలకు అర్ధం కావడం లేదు. ఇందులో ఏం టెక్నిక్ ఉందో అని ఎంత ఆలోచించినా ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరి ఈ జీఎస్టీ వర్మను ఎంతవరకూ తీసుకెళుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు