రాజ‌మౌళి సినిమాలో ఆమె... నిజ‌మేనా?

రాజ‌మౌళి సినిమాలో ఆమె... నిజ‌మేనా?

తొలిప్రేమ హిట్ తో రాశి ఖ‌న్నా ఫుల్‌ ఖుషీగా ఉంది. గ్లామ‌ర‌స్ పాత్ర‌లు కూడా తాను చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకుంది రాశి. తాను ఊహించ‌ని మ‌రో మంచి అవకాశం ఆమె కోసం సిద్దంగా ఉంద‌ని స‌మాచారం. ఆ సినిమాలో చేస్తే క‌చ్చితంగా క‌ల‌లు క‌న్న స్టార్ హీరోయిన్ హోదా రాశీకి వ‌చ్చేయ‌డం ఖాయం.

రాశీకి ల‌క్ బాగానే క‌లిసొస్తోంది. సమంత‌, కాజ‌ల్‌, అనుష్క వంటి హీరోయిన్లు సీనియ‌ర్లు అయిపోవ‌డంతో... అంద‌రూ ఇప్పుడు రాశీ వైపే చూస్తున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో తేడా లేకుండా న‌టించేస్తోంది ఈ భామ‌. అన్న‌ట్టు రాశీకి రంగ‌స్థ‌లంలో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింది. సుకుమార్ రామ‌ల‌క్ష్మీ పాత్ర కోసం రాశిని పిలిపించి... స్క్రీన్ టెస్టు చేశారు. ఎందుకోగాని ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. దీంతో రాశికి అవ‌కాశం చేజారింది. చెర్రీ ప‌క్క‌న న‌టిస్తే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించొచ్చు. కానీ రంగ‌స్థ‌లం అవ‌కాశం చేజార‌డంతో నిరాశ ప‌డి ఉంటుంది రాశి. కానీ ఆమె కోసం మ‌రో భారీ ఆఫ‌ర్ ఉన్న‌ట్టు స‌మాచారం.

జ‌క్క‌న్న రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో క‌లిపి ఒక మ‌ల్టీ స్టార‌ర్ సినిమా తీయ‌బోతున్నాడు. అందులో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్స్ ఉంది. చెర్రీ ప‌క్క‌న రాశిని తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం. అదే క‌నుక జ‌రిగితే... రాశి పంట పండిన‌ట్టే. రాజ‌మౌళి సినిమాలో...  చెర్రీ ప‌క్క‌న హీరోయిన్‌... ప్ర‌తి హీరోయిన్ కోరుకునే అవకాశాలే ఇవి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ప‌క్కన జై ల‌వ‌కుశ సినిమాలో న‌టించింది రాశి. అందుకే ఆమెను చెర్రీ ప‌క్క‌న అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ ప‌క్క‌న మ‌రో పాపుల‌ర్ హీరోయిన్ ను పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. రాశీకి ఆ సినిమాలో అవకాశం రావ‌డం ఎంత‌వ‌ర‌కు నిజ‌మో మాత్ర తెలియ‌దు. రూమర్ కూడా కావ‌చ్చు. చిత్ర యూనిట్ న‌టీన‌టుల వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తే కానీ... ఇది నిజ‌మో... రూమ‌రో తేలిపోతుంది.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English